ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తుకు నోటీసులను జారీ చేసిన నేపధ్యంలో ఆసక్తికర పరిణామాలు ఉండే సంకేతాలు కనపడుతున్నాయి. ఫార్ములా-ఈ రేసు కేసు కేసులో నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న బీఎల్ఎన్ రెడ్డి ఏ వాంగ్మూలం ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు ఈడీ విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు అవుతారు. 16న విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు పంపింది.
Also Read: కేటిఆర్ కు ఒకే రోజు రెండు షాక్ లు…!
ఈడి తొలుత ఈ నెల 2 వ తేదీన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బి. ఎల్. ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా కొంత సమయం కావాలని ఈ. డి అధికారులను ఆయన విజ్ఞప్తి చేసారు. దానికి సానుకూలంగా స్పందించిన ఈడి అధికారులు విచారణను ఈనెల 8వ తేదీకి వాయిదా వేస్తూ మరొక నోటీసును ఆయనకు జారీ చేశారు. ఫార్ములా ఈ రేస్ కేస్ కు సంబంధించి ఇప్పటికే ఈడి అధికారులు ఏసీబీకి పిటిషనర్ దాన కిషోర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా ఈడి సేకరించింది.. ఆ వాంగ్మూలం ఆధారంగా విచారణ చేపడుతోంది.
Also Read: సురేష్ కు సుప్రీం షాక్.. ఇప్పట్లో బయటకు రావడం కష్టమే..?
ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగం, ఫెమా నిబంధనలు ఉల్లంఘన వంటి అంశాలపై వీళ్ళను ఈడి అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇక ఫేమా నిబంధనలను ఉల్లంఘించినట్టు ఇప్పటికే గుర్తించారు. డబ్బుల బదిలీలో కీలకంగా వ్యవహరించిన బీఎల్ఎన్ రెడ్డిపైనే ఈడీ అధికారులు ఎక్కువ ఫోకస్ చేసారు. మనీలాండరింగ్ కు పాల్పడటంలో కూడా ఈయనదే కీలక పాత్ర అని భావిస్తున్నారు. ఇక నేడు అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారిస్తారు. రేపు కేటిఆర్ ను విచారించాలని నిర్ణయించారు.