మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు సీఎం. జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే అని ఆయన స్పష్టం చేసారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించా అని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్న చంద్రబాబు… వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసారు.
Also Read : టీటీడీ మరో కీలక నిర్ణయం…!
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలన్నారు. గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికి కనిపిస్తున్నాయని 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదన్నారు ఆయన.
Also Read : ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!
భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరు భాగస్వామ్యం కావాలని రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047 అని స్పష్టం చేసారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. ఈసారి కలెక్టర్ల సదస్సు ద్వారా ఎన్నో మార్పులు తీసుకొస్తామన్నారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు ఉన్నాయన్నారు. సమాధానాల రూపంలో నిర్వహిస్తామని తెలిపారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరతామన్నారు. సమయం సద్వినియోగం చేసుకోవాలని… మంత్రులు అధికారుల మధ్య సమన్వయం పెరుగుతుందన్నారు. ఆస్పత్రిలో చేరిన అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు చంద్రబాబు. అద్వానీ నాకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని ఆనాడు ఏపీ అభివృద్ధిలో అద్వానీ సహకారం మరువలేనిదన్నారు.