Monday, October 27, 2025 10:34 PM
Monday, October 27, 2025 10:34 PM
roots

పోలీసుల ముందు బోరుగడ్డ సంచలన విషయాలు 

గత కొన్నాళ్ళుగా వైసీపీ పేరు చెప్పుకుని రెచ్చిపోతున్న బోరుగడ్డ అనీల్ కుమార్ ఇప్పుడు పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. బోరుగడ్డ అనీల్ ను దాదాపు రెండు నెలల నుంచి పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు అనీల్ నోరు విప్పినట్టు వార్తలు రాలేదు. ఇక పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు విచారణ విషయంలో సీరియస్ గా ఉండటం, అటు ప్రభుత్వం కూడా ఈ విషయంలో పోలీసు శాఖపై సీరియస్ గా ఉండటంతో విచారణను పోలీసులు లైట్ తీసుకోలేదు.

Also Read : నాపై కక్ష అందుకే… మనోజ్ సంచలనం

ఇక విచారణలో పోలీసుల ఎదుట బోరుగడ్డ మొదటిసారి నోరు విప్పాడు. వైసీపీ అధిష్ఠానం ఒత్తిడి వల్లే సోషల్‌ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టాల్సి వచ్చిందని రౌడీషీటర్‌ బోరుగడ్డ అంగీకరించినట్టు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి శనివారం కస్టడీకి తీసుకున్న అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు పలు కీలక అంశాలపై అతన్ని విచారించారు. అనంతపురానికి ఆదివారం అర్ధరాత్రికి చేరుకుని విచారించారు. కేసు గురించి సమగ్రంగా విచారణ జరిపారు. తొలిరోజు తనకేమీ తెలియదని చెప్పిన బోరుగడ్డ సోమవారం కొంత నోరు విప్పాడట.

Also Read : వెయ్యి కోట్లు దోచిన పిన్నెల్లి… ఆధారాలు బయటకు

డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు సంబంధిత వీడియోల ఆధారంగా… అంటే చంద్రబాబు, లోకేశ్‌, వారి కుటుంబ సభ్యులను దూషించినవి చూపించి విచారించారట. పదేపదే సాక్ష్యాలను చూపించి ప్రశ్నలు సంధించడంతో తాను వైసీపీ హైకమాండ్‌ ఆదేశాల మేరకే సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టానని అంగీకరించాడట. ఒక యూట్యూబ్ ఛానల్ తనను ఎక్కువగా సంప్రదించింది అని… ఆ ఛానల్ తో మాట్లాడాలని ఆదేశించారు అని అనీల్ అంగీకరించాడు.

Also Read: బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్… అప్పటి నుంచే

ఇక ‘నిన్ను ఆదేశించిన ఆ వ్యక్తి ఎవరు’ అనే ప్రశ్నకు అతను గుర్తు లేదని సమాధానం ఇచ్చాడట. మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. బోరుగడ్డ కస్టడీ సమయం ముగుస్తుండటంతో సీఐ సాయినాథ్‌, ఎస్‌ఐ రాంప్రసాద్‌ సోమవారం సాయంత్రం 4.30గంటలకు కోర్టులో హాజరు పరిచి అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. అతని విచారణ సందర్భంగా పోలీసులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్