Saturday, September 19, 2026 10:14 AM
Saturday, September 19, 2026 10:14 AM

అన్ని బిర్యానీలు ఒకే దగ్గర…!

ఫుడ్ లవర్స్ కొత్త టేస్టులు ఎక్కడా దొరుకుతాయా అని వెతికి మరి తినేందుకు వెళ్తుంటారు. అలాంటి వారి కోసం విజయవాడ ఈట్ స్ట్రీట్ ఆహ్వానం పలుకుతుంది. అమెరికాలో ప్రారంభమైన ఈ కల్చర్ విజయవాడ వరకు పాకింది. ఇక్కడ దొరకని ఫుడ్ అంటూ ఉండదు. ఏపీ ఉన్నటువంటి బిర్యానీలన్నీ ఇక్కడ లభ్యమవుతున్నాయి. ధరలు కూడా నార్మల్‌గానే ఉంటుండంతో.. తినేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు.

విజయవాడ ఈట్‌ స్ట్రీట్‌..! ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ ఈట్‌ స్ట్రీట్‌లో… అన్ని రకాల ఫుడ్‌ ఐటమ్స్‌, బెస్ట్‌ క్వాలిటీతో లభిస్తాయి. అందుకే, రాత్రి పది అయిందంటే చాలు.. విజయవాడ వాసులు ఈట్ స్ట్రీట్ వైపు పరుగులు పెడుతున్నారు. నిత్యం వందలాది మంది తమకు ఇష్టమైన ఫుడ్‌ ఆస్వాదిస్తుండగా.. సుమారు 60 స్టాల్స్‌తో ఎంతో మంది జీవనోపాధిని పొందుతున్నారు.

Also Read : రేషన్ బియ్యం తరలిస్తే ఇక అంతే సంగతులు.. ఏపి కొత్త చట్టం

ఈట్‌ స్ట్రీట్‌లో బిర్యానీ చాలా ఫేమస్‌.. చికెన్‌తోనే ఆరు రకాలుగా బర్యానీ తయారు చేస్తుంటారు. అలాగే, బొంగు బిర్యానీ, అరకు, లంబసింగ్‌ బిర్యానీ, మొగల్తూర్ రాజుల బిర్యానీ, పలనాడు నాటుకోడి బిర్యానీ, కోడి పలావ్, నెల్లూరు రెడ్డి గారి చేపల పులుసు… ఇలా రకరకాలు దొరుకుతాయి. నాన్ వెజ్ మాత్రమే కాకుండా టిఫిన్స్, ఐస్‌క్రీమ్స్‌, ఫలుడా, గోలిసోడాలు ఇలా.. ప్రతి ఒక్క ఫుడ్‌ ఐటమ్‌ ఒకేచోట ఈట్‌ స్ట్రీట్‌లోలభిస్తాయి. ఇక, కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొన్ని ఫుడ్ స్టాల్స్ యజమానులు పంచెకట్టుతో, కండువా కప్పుకుని ఆహ్వానిస్తుంటారు. అలాగే, ఇస్తరాకుల్లో భోజనం వడ్డిస్తుంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త రుచులను కస్టమర్లకు అందిస్తుంటారు.

పెద్ద పెద్ద హోట్సల్‌, ఏసీ రూమ్స్‌లలో తినడం కంటే.. ఓపెన్‌ ప్లేస్‌లో తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. 200 రూపాయలకే రకరకాల వెరైటీలతో బిర్యానీ లభిస్తుండటంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌, ఫ్రెండ్స్‌తో వచ్చి తినడం సంతోషంగా ఉందంటున్నారు. కేవలం ఫ్యామిలీస్ మాత్రమే కాకుండా హాస్టల్లో ఉండే విద్యార్థులు సైతం ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.

Also Read : తిరుమలలో ముంతాజ్ హోటల్ రగడ, స్వామీజీల డిమాండ్ ఏంటీ…?

మొదట్లో రాత్రి 10 గంటలకే ఫుడ్‌ కోర్టులు మూతపడేవి. అయితే దుకాణదారుల అభ్యర్థన మేరకు ఇప్పుడు రాత్రి 12 గంటలకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో, రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు ఈట్‌ స్ట్రీట్ సందడి సందడిగా ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

పోల్స్