Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

తిరుమలలో ముంతాజ్ హోటల్ రగడ, స్వామీజీల డిమాండ్ ఏంటీ…?

తిరుమల ఆలయం పవిత్రతను దెబ్బ తీసే విధంగా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన సంగతి తెలిసిందే. హిందూ సమాజాన్ని అవమానించే విధంగా గత సర్కార్ నిర్ణయాలు తీసుకుంది. ఇక లడ్డు విషయంలో కూడా కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తిరుమలలో అన్యమతస్తులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అనే ఆరోపణలు వచ్చాయి. ముంతాజ్ హోటల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయింది.

Also Read : ఇదెక్కడి ట్విస్ట్, బుకింగ్ యాప్స్ లో పుష్పకు షాక్ ఇస్తున్న అమరన్

అలిపిరి వద్ద ఒబెరాయ్ విల్లాస్ పేరుతో ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ కు కేటాయించిన భూమిపై వివాదం నెలకొంది. 5 స్టార్ హోటల్ నిర్మాణానికి గాను 2021 లో అప్పటి ప్రభుత్వం 20 ఎకరాల భూమి కేటాయించింది. 4 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని జీఓ లో పేర్కొన్న ప్రభుత్వం… తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 604లో 20 ఎకరాల భూమిని 90 ఏళ్ల లీజుకు ఇచ్చింది. ఈ మేరకు 2021 నవంబర్ 24న జీఓ నెంబర్. 24 జారీ చేయగా అప్పటి నుంచి వివాదం నడుస్తోంది.

Also Read : ఏపీలో మెట్రో పరుగులు

శ్రీవారి పాదాల చెంత స్టార్ హోటల్ నిర్మాణాన్ని తప్పుపడుతున్న హిందూ సంఘాలు… నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసాయి. ఈ మేరకు గత నెల జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం లోనూ చర్చ జరిగింది. ఆధ్యాత్మికత పవిత్రత దెబ్బతింటుందని నిర్ణయం తీసుకున్నారు. గత నెల 18న జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో లీజు రద్దు చేయాలని ప్రభుత్వానికి టీటీడీ చైర్మన్ లేఖ రాసారు. అయినా సరే ఇంకా ముందుకు అడుగు పడలేదు. నేడు ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో అనుమతులు రద్దు చేయాలని తుడ కార్యాలయం ముందు స్వామీజీల నిరసనకు దిగారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తే… ఆలయ పవిత్రతను దెబ్బ తీసినట్టే అని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్