ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన పూరి జగన్నాథ్ తో ఇప్పుడు సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఎవరూ ముందుకు రావడం లేదు. పూరితో సినిమా చేసిన తర్వాతే చాలా మంది స్టార్ హీరోలు… స్టార్ అనే ఇమేజ్ తెచ్చుకున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా చాలా మంది హీరోలకు పూరి ఒకానొక దశలో కెరీర్ లో మైల్ స్టోన్ మూవీస్ ఇచ్చాడు. పోకిరి సినిమాకు ముందు మహేష్, దేశముదురు సినిమాకు ముందు అల్లు అర్జున్, టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్… ఇలా ఫ్లాప్ సినిమాలతోనే ఇబ్బంది పడ్డారు.
Also Read: అఖండ సీక్వెల్ పై క్రేజీ అప్డేట్
అలాంటి పూరితో ఇప్పుడు సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. అయితే పూరికి బాలయ్య మాత్రం అండగా నిలబడుతున్నట్టు తెలుస్తోంది. పైసా వసూల్ సినిమాతో ఇద్దరి మధ్య మంచి స్నేహమే ఏర్పడింది. సినిమా హిట్ కాదు ఫట్ కాకపోయినా ఆ సినిమా బాలయ్యకు మంచి జోష్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ పూరితో సినిమా చేయడానికి బాలయ్య రెడీ గానే ఉన్నారు అనే టాక్ వస్తోంది. ఎప్పటి నుంచో వీళ్ళ కాంబినేషన్ లో మూవీ ఉందనే ప్రచారం ఉంది. కానీ అది ముందుకు వెళ్ళడం లేదు.
Also Read: మందు గోల… రంగంలోకి పెద్దాయన…!
అయితే ఇటీవల బాలయ్యకు పూరి ఓ కథ చెప్పగా ఆ కథ బాలయ్య కంటే… ఆయన చిన్న కుమార్తె తేజస్విని కి చాలా బాగా నచ్చిందట. అందుకే పూరి ఈ కథతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల పూరి రెండు కథలను గోపిచంద్, అఖిల్ కు వినిపించగా వాళ్ళ నుంచి ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు. కాని బాలయ్య మాత్రం వెంటనే ఓకే చేసారట. బోయపాటితో ప్రస్తుతం బాలయ్య ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరితో సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమా పట్టాలెక్కితే బాలయ్యను పూరీ ఓ రేంజ్ లో చూపిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.