Saturday, September 13, 2025 03:21 AM
Saturday, September 13, 2025 03:21 AM
roots

అధికారం పోయినా పెత్తనం మాత్రం రెడ్డి గార్లదే..!

అప్పట్లో ఢిల్లీలో కమ్మ కులం గురించి వైఎస్ జగన్ ఓ కామెంట్ చేసారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో 36 మంది సిఐలకు పదోన్నతులు ఇస్తే.. మొత్తం 36 మంది కమ్మవారే అంటూ జగన్ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ సాక్షిగా వ్యాఖ్యలు చేశారు.. నిరూపించమంటే పారిపోయారు. జగన్ అధికారంలో ఉండగా.. కుల పిచ్చితో నిమ్మగడ్డ రమేష్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసారని మరో కామెంట్ చేశారు. జగన్ ప్రభుత్వంలో ఏపీలో ఎక్కడ ఏం జరిగినా కమ్మ కులమే టార్గెట్ అయ్యేది. తీరా చూస్తే… జగన్ ప్రభుత్వంలో పదవులు తీసుకున్న వాళ్ళ మొదలు, జగన్ వద్ద పెత్తనం చేసిన వాళ్ళు అందరూ రెడ్డి సామాజిక వర్గమే కావడం చూసి వైసీపీని అభిమానించిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు.

ఇప్పుడు అధికారం కోల్పోయింది… అయినా రెడ్డి గార్లకే మళ్ళీ జగన్ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా వైసీపీ లెటర్ హెడ్లో… పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దిగువ పేర్కొన్న నాయకులను రీజనల్ కో ఆర్డినేటర్లుగా నియమించడమైనది అంటూ ఉమ్మడి జిల్లాలకు బాధ్యులను ప్రకటించారు. ఒక్కసారి ఆ పేర్లు చూద్దాం… ఉమ్మడి అనంతపురం నెల్లూరు జిల్లాలకు మిథున్ రెడ్డి, కడప.. కర్నూలు జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చిత్తూరు.. గుంటూరు జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డి…

Also Read : సజ్జలకు హ్యాండిచ్చిన వైసీపీ సోషల్ మీడియా..!

కృష్ణా జిల్లాకు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఉత్తరాంధ్ర జిల్లాలకు విజయసాయి రెడ్డి, చిత్తూరు.. తిరుపతి జిల్లాలకు అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బూత్ కమిటీ రాష్ట్ర విభాగాల అధ్యక్షుడిగా సుధాకర్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు జగన్. ఇందులో మొత్తం రెడ్లపైనే జగన్ భారం వేయడం కాదు… ఇతర సామాజిక వర్గాల్లో బలమైన నేతలు లేనట్టుగా సొంత సామాజిక వర్గ నేతలకు బాధ్యతలు అప్పగించారు. మరి ఈ నియామకాలాను ఎలా వైసీపీ నేతలు సమర్ధించుకుంటారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్