Tuesday, November 24, 2026 06:06 PM
Tuesday, November 24, 2026 06:06 PM

ఇదేం బాదుడు రా బాబు.. వైభవ్ భీభత్సం..!

వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు మీద రికార్డుల మోత మోగుతున్నాయి. ఇప్పటి వరకు పొట్టి క్రికెట్‌లోనే సత్తా చాటిన ఈ బుడ్డొడ్డు.. ఇప్పుడు వన్డే క్రికెట్‌లో కూడా తన ఆట తీరులో ఎలాంటి మార్పు లేదని రుజువు చేశాడు. 50 ఓవర్ల పాటు సాగాల్సిన మ్యాచ్‌ను కేవలం 15 ఓవర్లలోనే ముగించేసి.. అంతా డ్రెస్సింగ్ రూమ్‌లో రిలాక్స్ అవ్వండి అంటూ ఓ నవ్వు నవ్వేశాడు. ఇది బ్యాటింగా.. లేక విధ్వంసమా.. అనేలా క్రిజ్‌లో చెలరేగిపోయాడు. ఇంకా చెప్పాలంటే.. ప్రత్యర్థి బౌలర్లపై కనీసం దయాదాక్షిణ్యం చూపించలేదు. బాల్ ఎక్కడ ఉంది.. అంటే.. అదుగో బౌండరీ లైన్ అవతల.. అని చూపించాడు కూడా.

Also Read : యలహంక ఆస్తులు.. వివేకా హత్య.. రెండింటికీ లింక్ ఉందా?

ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. లిస్ట్ – A క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేశాడు. అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత మరో సెంచరీ నమోదును తొందరగానే చేరుకున్నాడు. 28 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 13 సిక్స్ లు, 4 ఫోర్లతో సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ.. లిస్ట్-A క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ పేరుతో ఉన్న ఫాస్టెస్ట్ రికార్డును వైభవ్ బద్దలుగొట్టాడు.

Also Read : నాలుగు మేయర్ కుర్చీలు.. గెలిచేవి ఇవేనా..!

సెంచరీ తర్వాత మరింత చెలరేగిపోయాడు. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. అంటే.. సెంచరీ నుంచి డబుల్ సెంచరీ చేరుకునేందుకు కేవలం 24 బంతులు మాత్రమే తీసుకున్నాడు. 53 బంతుల్లోనే 204 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు మాత్రమే ఉన్నాయి. కానీ సిక్స్‌లు మాత్రం ఏకంగా 28 ఉన్నాయి. బౌండరీల రూపంలోనే 196 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. 250 పరుగులు టార్గెట్‌ను కేవలం 14.2 ఓవర్లలోనే భారత్ – ఏ జట్టు పూర్తి చేసింది. మ్యాచ్ చూస్తున్న వారికి ఇది వన్డే నా లేక టీ 20 నా అనే అనుమానం కలిగేలా వైభవ్ ఇన్నింగ్స్ ఉంది. భారత్ జట్టు చేసిన 250 పరుగుల్లో 204 వైభవ్ చేయగా.. మిగిలిన 50 పరుగుల్లో అభిషేక్ 12, రింకూ సింగ్ 27 రన్స్ చేశారు. ఇదేం కొట్టుడు రా బాబు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా 392 స్ట్రైక్ రైట్ అంటే.. అంతా షాక్ అవుతున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఫేస్‌బుక్ నుంచి పబ్‌జీ...

భారత సైన్యంలో సోషల్ మీడియా, మొబైల్...

నాలుగు మేయర్ కుర్చీలు.....

ఏపీలో నాలుగు మేయర్ స్థానాలకు ఎన్నికలు...

యలహంక ఆస్తులు.. వివేకా...

బెంగళూరులోని యలహంక పరిధిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి...

రహదారి భద్రతలో ఏపీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరి కేంద్రంగా ఏర్పాటు...

నాకేం సంబంధం లేదు.....

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్...

ఆస్ట్రేలియా మరో బాల్...

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మరోసారి బాల్...

పోల్స్