కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ప్రక్షాళనకు అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. పార్టీ జాతీయ స్థాయిలో కీలక మార్పులు చేపడుతూ ఒకేసారి 25 మంది కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించింది. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పార్టీ అనుబంధ విభాగాలకు కలిపి 81 మందికి కొత్త బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్.. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నియామకాలకు ఆమోదముద్ర వేయడంతో కొత్త బృందం తక్షణమే విధుల్లోకి దిగనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత బలోపేతం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాల వారీగా నాయకుల పనితీరు సమీక్షించి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయగలిగి వారికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
Also Read : ఓటమిని జీర్ణించుకోలేక బొత్స వాగుతున్నారు.. చిన్న శ్రీను స్ట్రాంగ్ కౌంటర్..!
కాంగ్రెస్ అధిష్ఠానం కొంతకాలంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రత్యే దృష్టి సారించింది. రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి సమన్వయం, నాయకు పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత సెప్టెంబరులో రాహు గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ 64 మంది ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సంస్థాగత బలహీనతలపై చర్చించారు. ఈ సమీక్షల అనంతరం తాజాగా భారీ మార్పులకు అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ యంత్రాంగాన్ని మరింత క్రియాశీలకం చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
తాజా మార్పుల్లో తెలుగు రాష్ట్రాల బాధ్యతల కేటాయింపు ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సచిన్ సావంత్. సైమన్ అలెక్స్‌లను నియమించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు అండమాన్ నికోబార్ దీవులు బాధ్యతలను సెంథిల్ అరసు.వీ.శంకర్‌కు అప్పగించారు. రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, నాయకుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై వీరు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ భిన్నమైన రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెలంగాణలో అధికారంలో ఉ న్న పార్టీగా ప్రభుత్వ పనితీరుతోపాటు పార్టీ వ్యవస్థను సమన్వయం చేసుకోవాల్సి ఉండగా.. ఏపీలో పార్టీ పునర్నిర్మాణం. కేడర్లను క్రియాశీలకం చేయడం కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కొత్త కార్యదర్శుల నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read : నాడు వైఎస్సార్ ఆహ్వానిస్తే షర్మిల పెళ్లికి కూడా వెళ్లా: సీఎం చంద్రబాబు
కాంగ్రెస్ చేపట్టిన ఈ భారీ మార్పులు కేవలం పదవుల మార్పిడికే పరిమితం అవుతాయా? లేక క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి దోహదపడతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించే నాయకులు ఆయా రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులను ఎంత మేరకు సమన్వయం చేస్తారు? ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఏ స్థాయిలో నడిపిస్తారు? ఎన్నికల సమయంలో పార్టీకి ఎలాంటి ఫలితాలు తీసుకొస్తారు? అన్నది కీలకం కానుంది. ముఖ్యంగా 2027 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే రాష్ట్రాల్లో ఈ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. బాధ్యతల కేటాయింపుతో మొదలైన ప్రక్షాళన.. క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించినప్పుడే సార్థకమవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


