Saturday, November 21, 2026 12:03 PM
Saturday, November 21, 2026 12:03 PM

స్టాక్ మార్కెట్లోకి APMDC.. చంద్రబాబు మెగా ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. 2027 డిసెంబర్ నాటికి ఈ సంస్థను స్టాక్ మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం APMDC ఈక్విటీ విలువను రూ. 86,290 కోట్లుగా అంచనా వేశారు. ఇక సంస్థ చేతిలో ఉన్న మొత్తం ఖనిజ సంపద విలువ ఏకంగా రూ. 7.8 లక్షల కోట్లుగా ఉండటం విశేషం.

Also Read : ఒకే ఇంట్లో ఎమ్మెల్యే.. జెడ్పీ ఛైర్‌పర్సన్.. ఏపీలో నాలుగు కుటుంబాల అరుదైన రికార్డు..!

సీఎం చంద్రబాబు నాయుడు మైనింగ్ రంగంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అరుదైన ఖనిజాల కోసం ప్రత్యేకంగా రేర్ ఎర్త్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో ఉపయోగపడతాయి.

అలాగే, రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు, పరిశ్రమల వృద్ధి కోసం పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, జార్ఖండ్‌లలో బొగ్గు నిల్వలను దక్కించుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఖనిజాలు దొరికే అవకాశం ఉన్న 582 ప్రాంతాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో అన్వేషణ జరపాలని సీఎం ఆదేశించారు.AI వాడకం వల్ల భూమిలో ఏయే ఖనిజాలు ఎక్కడ ఉన్నాయో చాలా తక్కువ సమయంలో, కచ్చితంగా తెలుసుకునే వీలుంటుంది.

Also Read : ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల అసూయ ఎందుకు?

APMDCని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం వల్ల రాష్ట్రానికి భారీగా నిధులు సమకూరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రూ. 7.8 లక్షల కోట్ల ఖనిజ సంపదను సరైన పద్ధతిలో వినియోగించుకుని, ఏపీని దేశంలోనే నంబర్ వన్ మైనింగ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మెగా ప్లాన్‌ను అమలు చేస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

చంద్రబాబు, లోకేష్‌తో భేటీ...

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం...

ఒకే ఇంట్లో ఎమ్మెల్యే.....

ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు...

ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల...

IndiaStat, Projects Today గణాంకాల ప్రకారం,...

పేదింటి దళిత బిడ్డకు...

ఎన్టీఆర్ జిల్లా తొలి జిల్లా పరిషత్...

కాలుష్యానికి కారకులెవరు..?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా...

పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.....

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో...

పోల్స్