Saturday, November 21, 2026 11:42 AM
Saturday, November 21, 2026 11:42 AM

చంద్రబాబు, లోకేష్‌తో భేటీ అయినా తగ్గని ఆదినారాయణ రెడ్డి..!

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం కేటాయింపు వ్యవహారంపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అసంతృప్తి ఇంకా చల్లారలేదు. ఈ వివాదంపై ఆయన విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లతో విడివిడిగా భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో తన సోదరులు రాజశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే, అగ్రనేతలతో జరిపిన చర్చలు కూడా ఆశాజనకంగా లేవని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేయడంతో ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

Also Read : ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల అసూయ ఎందుకు?

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా కూటమి పెద్దలు హామీ ఇచ్చినట్లుగా కడప జడ్పీ ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించాలని సీఎం చంద్రబాబు, లోకేష్‌లను కోరానని తెలిపారు. కానీ, చివరి నిమిషంలో సమీకరణాల పేరుతో ఆ పదవిని టీడీపీకి కేటాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీటీసీ పదవులకు రాజీనామా చేసే విషయంలో తమ పిల్లలు (సోదరుడి కుమారులు) ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరని ఆదినారాయణ రెడ్డి తేల్చిచెప్పారు.

Also Read : భారీగా పడిపోయిన బంగారం.. ఇప్పట్లో పెరగడం కష్టమేనా..?

ఇక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపై పార్టీ జాతీయ పెద్దలు, ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. మరోవైపు, కూటమి సర్దుబాటులో భాగంగానే కడప జడ్పీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వలేకపోయామని సీఎం చంద్రబాబు ఆయనకు వివరించినట్లు సమాచారం. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బుజ్జగింపులు, ఇటు సీఎం చంద్రబాబు, లోకేష్‌లతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆదినారాయణ రెడ్డి తదుపరి అడుగు ఎటువైపు ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఒకే ఇంట్లో ఎమ్మెల్యే.....

ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు...

ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల...

IndiaStat, Projects Today గణాంకాల ప్రకారం,...

పేదింటి దళిత బిడ్డకు...

ఎన్టీఆర్ జిల్లా తొలి జిల్లా పరిషత్...

కాలుష్యానికి కారకులెవరు..?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా...

పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.....

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో...

బ్రేకింగ్: ఎమ్మెల్యే పదవికి...

వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్...

పోల్స్