Friday, November 20, 2026 05:00 PM
Friday, November 20, 2026 05:00 PM

విప్ ధిక్కరించి మరీ.. ఎంపీపీ ఎన్నిక వెనుక కుట్ర..!

ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వనప్పుడు.. ఏం జరుగుతుందో నిరూపించే సంచలనం పాలకొండ మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో చోటు చేసుకుంది. బహుశా, ఇలాంటి ఘటన రాష్ట్రంలో ఇదేనేమో..? అన్నట్లుగా మారింది. అధికార కూటమిలో, ప్రత్యేకంగా టీడీపీ పెద్దలకు పాలకొండ ఎన్నిక ఓ హెచ్చరిక కూడా అనేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. డబ్బు తప్ప ఓటింగ్ బలం లేని వ్యక్తిని ఎంపిక చేస్తే ఏమవుతుందో, పాలకొండ ఎంపీటీసీలు టీడీపీ, జనసేన నాయకులకు రుచి చూపించారు. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో పెను సంచలనం సృష్టించిన ఈ పరిణామం చాలా నాటకీయంగా జరిగింది.

Also Read : 2028–29 ఎన్నికలు వేరే లెవెల్ ! అధికారం కోసం అమీతుమీ !

జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న పార్వతీపురం-మన్యం జిల్లాలోని పాలకొండ ఎంపీపీ పదవికి ఎన్నిక ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ఎంపీటీసీల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొమ్మిది, జనసేన రెండు, వైసీపీ ఒక స్థానాన్ని గెలిచాయి. టీడీపీ సీనియర్ నాయకుడు కర్నేన అప్పలనాయుడు తన భార్య యోగిత, కుమార్తె సాయిను ఎంపీటీసీలుగా గెలిపించుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో ఉన్న తన కుటుంబానికి ఎంపీపీ పదవి ఎ ఇప్పించాలంటూ జిల్లా, రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర తన మద్దతు ఎంపీటీసీలతో వెళ్లి కలిశారు.

ఇక పాలకొండ ఎంపీపీ ఎన్నిక కోసం పార్టీ పరిశీలకురాలుగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ వచ్చారు. అప్పలనాయుడు వ్యవహారం కావలి గ్రీష్మతో పాటు పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ భూదేవి కూడా పూర్తిగా తెలుసు. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మద్దతు కూడా కర్నేన కుటుంబానికే ఉందని తెలుసుకున్న భూదేవి.. తనకు అనుకూలమైన వారి కోసం పావులు కదిపారు. పాలకొండ మునిసిపల్, ఎంపీపీ ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన గ్రీష్మ కూడా భూదేవితో చేతులు కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఇద్దరు కలిసి.. కర్నేన అప్పలనాయుడును కాదని.. టీడీపీ మండల అధ్యక్షుడు గండి రామినాయుడు వైపు మొగ్గు చూపారు. ఆయన ఇంట్లోనే నాలుగు రోజులు బస చేశారు కూడా. దీంతో అప్పలనాయుడు తన మద్దతుదారులతో రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయారు.

Also Read : ఎన్టీఆర్ బాటలో పవన్.. కారణం..?

అయినా సరే.. రామినాయుడు కోడలు గౌతమికి ఎంపీపీ పదవి ఇప్పించేందుకు విప్ జారీ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సీల్డ్ కవర్‌లో గౌతమి పేరు తెప్పిస్తే.. అంతా సైలెంట్‌గా ఉంటారని భావించారు. అనుకున్నట్లుగానే సీల్డ్ కవర్‌లో గౌతమి పేరు వచ్చింది. విప్ ధిక్కరిస్తే పదవులు పోతాయంటూ పార్టీ నేతలను బెదిరించారు కూడా. అయినా సరే.. ఇవేవి లెక్క చేయని అప్పలనాయుడు సతీమణి యోగిత పోటీ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఓటింగ్‌లో గౌతమికి టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఒక్కొ ఎంపీటీసీ మాత్రమే మద్దతు లభించింది. యోగితకు మాత్రం జనసేన, వైసీపీ ఎంపీటీసీలతో పాటు ఆరుగురు టీడీపీ ఎంపీటీసీలు ఓటు వేశారు. దీంతో గౌతమికి రెండు ఓట్లు మాత్రమే రాగా.. యోగితకు 8 మంది మద్దతు తెలిపారు.

Also Read : కాకినాడ పరిణామం.. సిక్కోలుకు సంకేతమా..?

దీంతో పరువు పోయినట్లు భావించిన గ్రీష్మ.. విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, సీనియర్ నాయకుడు అప్పలనాయుడు పై కూడా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి భూదేవితో కలిసి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి నివేదిక పంపించినట్టు సమాచారం. తిరుగుబాటు అభ్యర్థికి ఓటు వేసిన జనసేన ఎంపీటీసీ గొర్రె వరలక్ష్మి ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో, మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను గౌరవించని పరిశీలకరాలు గ్రీష్మ పైన, భూదేవి పైనా చర్యలు తీసుకోవాలని అప్పలనాయుడు సహా ఎంపీటీసీలు, పలువురు పార్టీ నేతలు కూడా టిడిపి నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను స్వయంగా కలుస్తామంటున్నారు కూడా. ఈ వివాదం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పేదింటి దళిత బిడ్డకు...

ఎన్టీఆర్ జిల్లా తొలి జిల్లా పరిషత్...

కాలుష్యానికి కారకులెవరు..?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా...

పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.....

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో...

బ్రేకింగ్: ఎమ్మెల్యే పదవికి...

వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్...

తల్లయిన సమంత.. ముద్దుల...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్...

జాతీయ స్థాయిలో కాంగ్రెస్...

వచ్చే 2029 లోక్‌సభ ఎన్నికలే ప్రధాన...

పోల్స్