Tuesday, November 17, 2026 12:02 PM
Tuesday, November 17, 2026 12:02 PM

విజయ డెయిరీలో ఏం జరుగుతుంది.. ఎమర్జెన్సీ మీటింగ్ ఎందుకు..?

కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం.. విజయ డెయిరీ పాలకమండలిలో ఒక్కసారిగా సంక్షోభ వాతావరణం నెలకొంది. డెయిరీ ఛైర్మన్ సహా ఐదుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నిక చెల్లదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు విజయ డెయిరీ యాజమాన్యం అత్యవసర బోర్డు సమావేశానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు బోర్డు డైరెక్టర్లందరికీ అత్యవసర సమావేశం నోటీసులు జారీ కావడంతో విజయవాడ రాజకీయ, సహకార వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read : ఎన్విడియా వివాదం వేళ భారత్ సంచలన నిర్ణయం.. చైనాకు మాస్టర్ స్ట్రోక్

విజయ డెయిరీ బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావుతో పాటు డైరెక్టర్లు సాయి, పాలడుగు నాని, నాగేశ్వరరావు, శైలజ ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు వారి ఎన్నిక చెల్లదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం పది మంది కోరం సభ్యులు ఉండాల్సిన సమయంలో కేవలం ఎనిమిది మంది హాజరు కావడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం, ప్రత్యర్థి అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తూ జరిగిన ఎన్నిక ప్రక్రియను రద్దు చేసింది.

Also Read :పెద్దలలో టైప్ 1 మధుమేహంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన మార్గదర్శకాలు..!

హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో విజయ డెయిరీ పాలకవర్గంలో ఖాళీలు ఏర్పడటంతో పాటు సంస్థ పరిపాలన, నాయకత్వ మార్పుపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో యాజమాన్యం జారీ చేసిన నోటీసుల మేరకు జరిగే అత్యవసర భేటీ అత్యంత కీలకంగా మారనుంది. హైకోర్టు తీర్పు ప్రతులను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం బోర్డు డైరెక్టర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారు. రద్దయిన స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలా, లేక పూర్తిస్థాయి పాలకవర్గం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలా అనే అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జగన్ ఫేక్ ట్వీట్‌కు...

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై...

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల...

ఇప్పటికే 2 తుపాన్లతో అల్లాడుతున్న ఏపీ...

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు,...

ఏపీ లిక్కర్ స్కామ్...

ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న...

పోల్స్