Saturday, November 14, 2026 08:39 PM
Saturday, November 14, 2026 08:39 PM

‘రంగమ్మత్త’కు అవకాశాలు లేవా..?

బుల్లితెరపై వ్యాఖ్యాతగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ‘క్షణం’లో విభిన్నమైన పాత్రతో ఆకట్టుకున్న ఆమెకు ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్ర మరింత గుర్తింపు తెచ్చింది. ‘ఖిలాడి’, ‘పుష్ప’ వంటి చిత్రాల్లోనూ భిన్నమైన పాత్రలు పోషించారు. నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటూ సాగిన ఆమె ప్రయాణం, బుల్లితెర నుంచి సినిమాల్లోకి రావాలనుకునే వ్యాఖ్యాతలకు స్ఫూర్తిగా నిలిచింది.

Also Read : దిల్ రాజు పై పెయిడ్ ట్రోల్స్ నడిపిందెవరు?

ఒక దశలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న అనసూయ ఈ మధ్య వెండితెరపై అరుదుగా కనిపిస్తున్నారు. ఆమె కొత్త సినిమాల గురించి ప్రకటనలు తగ్గడంతో ఈ విరామానికి కారణాలేమిటనే చర్చ మొదలైంది. తనకు సరిపడే పాత్రల కోసం ఆమె వేచి చూస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె వ్యాఖ్యల చుట్టూ తలెత్తిన వివాదాల ప్రభావం కూడా ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే ఆ వివాదాల కారణంగా ఆమెకు అవకాశాలు తగ్గాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో విమర్శలకు స్పందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే ప్రతి వాదనకూ స్పందిస్తే, ఒక నటుడి పని కంటే ఆ వ్యాఖ్యలే ఎక్కువగా చర్చకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. వార్తల్లో నిలిచేందుకు వివాదాలను ఆశ్రయించడం తాత్కాలిక ప్రచారాన్నే ఇస్తుంది. సినిమా అవకాశాల విషయంలో పాత్రకు సరిపడే ప్రతిభ, గత చిత్రాల్లో చూపిన అభినయం, దర్శకులతో ఏర్పడే వృత్తిపరమైన అనుబంధం ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటాయి.

Also Read : వెండితెర పై చెరగని ముద్ర.. నటుడు గిరిబాబు కన్నుమూత

అనసూయకు బలమైన పాత్రలను మెప్పించగల సామర్థ్యం ఉందని ఆమె గత చిత్రాలే చూపించాయి. సోషల్‌ మీడియా వాదనలకు దూరంగా ఉంటూ, తన నటనకు ఆస్కారమున్న కథల ఎంపికపై దృష్టి పెడితే కొత్త అవకాశాలకు మార్గం సుగమమవుతుంది. రంగమ్మత్త తరహాలో ప్రేక్షకులకు గుర్తుండిపోయే మరో పాత్రే ఆమె తదుపరి కెరీర్‌ మలుపును నిర్ణయించగలదు. ఇప్పుడు తన దారి ఏమిటో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నం అయిందని అనసూయం గుర్తిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

దిల్ రాజు పై...

యశ్ నటించిన ‘టాక్సిక్’ తెలుగు విడుదల...

తారక్ టైమింగ్‌కు అనిల్...

‘ఇది ఖచ్చితంగా నవ్వుల జాతర కాబోతోంది’...

వెండితెర పై చెరగని...

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా...

సాక్షి ఛానల్ కు...

రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అసత్య...

జగన్ చెప్పినా వినను.....

ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో వ్యవహరించే...

సర్పంచ్.. ఒకటో సారి.....

అయ్య బాబోయ్.. అమ్మ భాబోయ్.. పంచాయతీ...

పోల్స్