Friday, November 6, 2026 01:01 PM
Friday, November 6, 2026 01:01 PM

పోలవరం ఇప్పట్లో కష్టమేనా..? కీలక పరిణామాల దిశగా అడుగులు..!

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణ గడువు స్వల్పంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఈ ప్రాజెక్టును 2027 మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే, క్షేత్రస్థాయిలో పనుల పురోగతి మరియు వాస్తవ పరిస్థితులను బేరీజు వేసి, గడువును మరో మూడు నెలల పాటు అంటే వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాల్సిన అవసరం ఉందా అనే అంశంపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దృష్టి సారించింది.

Also Read: ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.. ఈడీ సంచలన ప్రకటన..!

పనులు ఖచ్చితంగా ఎప్పటికి పూర్తవుతాయో తేల్చేందుకు పీపీఏ ఐదుగురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో పీపీఏ సభ్య కార్యదర్శి, పోలవరం అథారిటీ చీఫ్ ఇంజినీర్, ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్, వ్యాప్కోస్ జనరల్ మేనేజర్, పునరావాస కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రధాన డ్యాం నిర్మాణం, ఆకృతుల అనుమతులు, భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణ వాస్తవ పరిస్థితులను పరిశీలించి త్వరలోనే సమగ్ర నివేదిక సమర్పించనుంది.

Also Read: రెబల్స్ దెబ్బ.. మరి వారి సంగతేంటి సార్..!

పోలవరం తొలిదశ పనుల కోసం కేంద్ర మంత్రిమండలి రూ. 30,436.95 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ నిధులను షరతుల ప్రకారం 2027 మార్చి 31 లోపు మాత్రమే ఖర్చు చేయడానికి వీలుంటుంది. ఒకవేళ పనులు గడువు దాటి సాగితే, తదుపరి ఆర్థిక సంవత్సరంలో నిధులు ఖర్చు చేయడానికి కేంద్ర జలశక్తి శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పోలవరం పనుల కోసం దాదాపు రూ. 981.12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే పీపీఏ గడువు పెంపును కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా రాయనుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.....

గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద స్థానిక...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

రెబల్స్ దెబ్బ.. మరి...

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఘట్టం...

ఓటమి నేర్పిన గుణపాఠం...

అధికారం కోల్పోయిన రాజకీయ పార్టీకి ప్రజల్లో...

ఇది కదా కావాల్సింది.....

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్...

తిరుమల లడ్డూ కల్తీ...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తిరుమల...

పోల్స్