Friday, November 6, 2026 12:03 PM
Friday, November 6, 2026 12:03 PM

గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.. అప్పిరెడ్డికి షాక్ ఇచ్చిన పోలీసులు..!

గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద స్థానిక సంస్థల ఎన్నికల ముగింపు వేళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, అనుమతి లేకుండా ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించడం వంటి అభియోగాలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం గురువారం రాత్రి వెంగళాయపాలెం నుంచి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తుండగా ఈ వివాదం మొదలైంది.

Also Read: ఓటమి నేర్పిన గుణపాఠం ఏది.. కారణాలపై సమీక్షేదీ..?

బ్యాలెట్ బాక్సులను తరలించే క్రమంలో ఎన్నికల సిబ్బంది వద్ద నుంచి వైసీపీ నేతలు బ్యాలెట్ బాక్స్‌ను లాక్కున్నారని, విధులను అడ్డుకున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే, అధికారులు బ్యాలెట్ బాక్సులను అక్రమంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ ఘటనకు నిరసనగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

Also Read: ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.. ఈడీ సంచలన ప్రకటన..!

ఈ ధర్నా కారణంగా గుంటూరు-నల్లపాడు మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ప్రభుత్వ విధులను అడ్డుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేసి, అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేసారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పోలవరం ఇప్పట్లో కష్టమేనా..?...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

రెబల్స్ దెబ్బ.. మరి...

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఘట్టం...

ఓటమి నేర్పిన గుణపాఠం...

అధికారం కోల్పోయిన రాజకీయ పార్టీకి ప్రజల్లో...

ఇది కదా కావాల్సింది.....

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్...

తిరుమల లడ్డూ కల్తీ...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తిరుమల...

పోల్స్