Wednesday, November 4, 2026 04:28 PM
Wednesday, November 4, 2026 04:28 PM

హార్దిక్ తో ఆ జట్టుకు ఉపయోగం లేదా..?

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడనున్నారనే వార్తలు క్రికెట్ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 17న రిటెన్షన్ గడువు ముగియనుండటంతో, హార్దిక్‌ను పంజాబ్ కింగ్స్ లేదా రాజస్థాన్ రాయల్స్ జట్లు ట్రేడింగ్ ద్వారా దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ ట్రేడింగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ నుంచి స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, విష్ణు వినోద్‌లు ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళ్లేందుకు ఇరు జట్ల మధ్య అడ్వాన్స్‌డ్ లెవెల్ చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది.

Also Read : కేంద్రం వెంటపడుతోన్న సీఎం.. అసలేం జరుగుతోంది..?

ఈ తాజా బదిలీల వార్తలపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందిస్తూ పంజాబ్ కింగ్స్ అనుసరిస్తున్న వ్యూహాలను ప్రశ్నించాడు. పంజాబ్ జట్టులో ఇప్పటికే మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి నాణ్యమైన అంతర్జాతీయ ఆల్ రౌండర్లు ఉన్నారని అతను గుర్తుచేశాడు. అంతమంది ఆల్ రౌండర్ల దండును పెట్టుకుని, మళ్లీ హార్దిక్ పాండ్యాను కూడా చేర్చుకుంటే ఆ జట్టులో తుది ఎంపిక అత్యంత క్లిష్టంగా మారుతుందని చోప్రా అభిప్రాయపడ్డాడు.

Also Read : ఎన్నికల్లో ట్రంప్ కు షాక్.. భారత్ కు ఎలా ప్లస్..?

అంతేకాకుండా, పంజాబ్ కింగ్స్ జట్టుకు మొదటి నుంచి బౌలింగ్ విభాగమే బలహీనతగా ఉందని ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు. అటువంటి తరుణంలో ఆ జట్టు తమ ప్రధాన పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ముంబై ఇండియన్స్‌కు ఇచ్చేయడం ఎంతవరకు సమంజసమని అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఒకవేళ అర్ష్‌దీప్‌ను వదులుకుంటే పంజాబ్ జట్టు బౌలింగ్ లైనప్‌ను బ్యాలెన్స్ చేయడానికి వేలంలో మరికొన్ని కఠినమైన బదిలీలు లేదా ప్రయోగాలు చేయాల్సి వస్తుందని, ఇది ఆ జట్టుకు పెద్ద సవాల్‌గా మారుతుందని ఆయన స్పష్టం చేశాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఎన్నికల్లో ట్రంప్ కు...

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్...

కేంద్రం వెంటపడుతోన్న సీఎం.....

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు...

ఈవీఎం కాదు.. బ్యాలెట్.....

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో...

బ్రేకింగ్: పరిషత్ ఎన్నికలు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు...

పీఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ...

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్...

బొత్స వారసురాలికి షాక్...

సినిమాల్లో, రాజకీయాల్లో వారసులు సక్సెస్ కావడం...

పోల్స్