Thursday, October 29, 2026 03:37 PM
Thursday, October 29, 2026 03:37 PM

బయట అర్నాబ్ బీభత్సం.. లోపల జగన్ ఆస్తుల లెక్కలు..!

రాష్ట్రం అర్నాబ్ తుఫాన్ ముప్పుతో వణికిపోతోంది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వందలాది గ్రామాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది. ఈదురుగాలుల ధాటికి చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగి జనం నడిరోడ్డుపై అల్లాడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన, కనీసం భరోసా ఇవ్వాల్సిన మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం ఇంత పెద్ద ప్రమాదంలో ఉంటే.. జగన్ మాత్రం ఇప్పటివరకు తుఫాన్ బాధితుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.

Also Read : బౌలర్ల పాలిట నరకంగా మారిన కివీస్ పిచ్‌లు..!

సొంత చెల్లెలితో ఆస్తుల గొడవలు, కోర్టుల చుట్టూ తిరగడం, ఆస్తుల లెక్కలు తేల్చుకోవడంలో చూపిస్తున్న శ్రద్ధలో పదో వంతు శ్రద్ధ కూడా ప్రజలపై లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సొంత చెల్లెలి ఆస్తుల మీద ఉన్న శ్రద్ధలో కొంచెమైనా ప్రజలపై ఉంటే.. ఈ పాటికి వైసిపి కార్యకర్తలకు “జనానికి సాయం చేయండి” అని పిలుపునిచ్చేవారని, కానీ జగన్ నుంచి అలాంటి ఎలాంటి ప్రకటన రాలేదని విమర్శలు వస్తున్నాయి. విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలవడంలో వైసిపి పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : ఇరాన్‌పై దాడికి అమెరికా సైన్యం రెడీ..? 96 గంటల్లోనే విధ్వంసం..!

జనం సర్వస్వం కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే, కనీసం సొంత పార్టీ క్యాడర్‌ను కూడా సహాయక చర్యల్లోకి దించలేని అసమర్థత జగన్ నాయకత్వంలో కనిపిస్తోందని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం అని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే కనీసం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని ఒక ట్వీట్ లేదా ప్రెస్ నోట్ కూడా విడుదల చేయకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ప్రజా సంఘాలు సైతం విమర్శిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

కూటమిలో రెబల్స్‌పై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న జరగబోయే పట్టణ,...

కరువు ముప్పు.. కదిలిన...

ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో...

యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...

ఉత్తరప్రదేశ్ తమ కంచుకోట అనుకున్న బిజెపికి...

ఇరాన్‌పై దాడికి అమెరికా...

ప్రపంచవ్యాప్తంగా దాదాపు గత ఏడాది కాలంగా...

బ్యాలెట్ పద్ధతిలోనూ కాంగ్రెస్...

దేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన...

అర్నబ్ వెనుకాలే ఏపీకి...

తీర ప్రాంత ప్రజలు తీవ్ర తుఫాన్...

పోల్స్