ప్రపంచవ్యాప్తంగా దాదాపు గత ఏడాది కాలంగా అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం సంచలనంగా మారింది. తాజాగా మిడిల్ ఈస్ట్ సంక్షోభం మరో ప్రమాదకరమైన మలుపు తిరిగింది. ఇరాన్‌పై భారీ ఎత్తున సైనిక దాడులు చేయడానికి అమెరికా దళాలు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయని, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి ఆదేశాలు వచ్చిన కేవలం 96 గంటల వ్యవధిలోనే ఈ దాడులు ప్రారంభం కానున్నాయని ఇద్దరు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ఒక సంచలన నివేదికను వెల్లడించింది.
Also Read : అర్నబ్ వెనుకాలే ఏపీకి కొత్త తుఫాన్ ముప్పు..?
ఈ దాడుల కోసం మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో ఇప్పటికే తగినంత స్థాయిలో అమెరికా బలగాలు మోహరించి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దాడులు ఎప్పుడు చేయాలనే దానిపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఇరాన్ రాడార్లు, క్షిపణి లాంచర్లు లేదా సైనిక స్థావరాల వంటి పరిమిత లక్ష్యాలకే పరిమితం కాకుండా.. ఈసారి అంతకంటే పెద్ద ఎత్తున సుదీర్ఘ సైనిక చర్యకు పెంటగాన్, యూఎస్ సెంట్రల్ కమాండ్ సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరాన్‌కు చెందిన కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలు, అణు కేంద్రాలను సైతం తమ టార్గెట్ లిస్ట్‌లో చేర్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
Also Read : ఇంకా ఎంత కాలం ఇలా ఏడుపు..?
అమెరికాలో జరగబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, ఈ ఏడాది చివరి నాటికి ఈ తాజా దాడులపై ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా లేదా ఇజ్రాయెల్ కనుక తమపై మొదట దాడులు చేస్తే తీవ్రంగా తిప్పికొట్టేందుకు ఇరాన్, యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతీకార దాడుల ప్రభావం కేవలం మిడిల్ ఈస్ట్‌కే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోని అమెరికా సిబ్బంది, ఆస్తులపై కూడా పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వెలువడుతున్నాయి.


