Wednesday, September 30, 2026 05:33 PM
Wednesday, September 30, 2026 05:33 PM

కొత్త ఓటర్లకు గుడ్ న్యూస్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..!

దేశంలో నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే పౌరులు సమర్పించే ఆన్‌లైన్ ఫారమ్-6 అప్లికేషన్ల నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్అదనపు డిక్లరేషన్‌ను ఉపసంహరిస్తూ అధికారిక పోర్టల్‌లో మార్పులు చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సరికొత్త సడలింపు తక్షణమే అమలులోకి రానుండటంతో కొత్త ఓటర్లకు పెద్ద ఊరట లభించింది.

Also Read : జగన్‌ను జైల్లో పెట్టిన పార్టీతో పొత్తా..? సిగ్గుండాలి..!

ఈ వివాదాస్పద నిబంధన ప్రకారం.. ఆన్‌లైన్‌లో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసేటప్పుడు దరఖాస్తుదారులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా తాతల వివరాలను మునుపటి ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తూ ఒక అదనపు డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది. అయితే, చట్టబద్ధమైన ఫారమ్-6 నిబంధనలను మార్చడంపై ఎన్నికల కమిషనర్ల నుంచి అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ఐటీ డిపార్ట్‌మెంట్ చేసిన టెక్నికల్ మార్పుల వల్లే ఈ అదనపు ఫీల్డ్స్ ఆన్‌లైన్ లో దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారాయని అధికారులు క్లారిటీ ఇస్తూ, ప్రస్తుతం వాటిని తొలగించారు.

Also Read : దుబాయ్ విమానం హైజాక్..? అసలేం జరిగింది..?

తాజా మార్పుల ప్రకారం, ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన రాష్ట్రాల్లోని నూతన దరఖాస్తుదారులు ఇకపై ఎలాంటి అదనపు నిబంధనలు లేకుండానే.. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960 ప్రకారం సాధారణ ఫారమ్-6 ద్వారా ఓటు హక్కు కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం ఇంకా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల్లో మాత్రం ఈ నిబంధన యథాతథంగా కొనసాగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా దరఖాస్తుదారులకు సాంకేతిక ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విశాఖ మెట్రోకు గ్రీన్...

ఏపీలో విశాఖ అతి పెద్ద నగరం....

జగన్‌ను జైల్లో పెట్టిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న...

కుమార్తె పెళ్లి తర్వాతే...

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

దుబాయ్ విమానం హైజాక్..?...

దుబాయ్ నుండి ఇజ్రాయెల్ రాజధాని టెల్...

కాపులపై ప్రేమ కాదు,...

సాక్షి మీడియా రోజు రోజుకూ దిగజారుతోంది....

ఏపీ మద్యం స్కామ్‌లో...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్సార్‌సీపీ హయాం...

పోల్స్