రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అలాగే ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలను వెల్లడించాడు. జగదీశ్వరరెడ్డిని మట్టుబెట్టి, ఆ తర్వాత అతని భార్య సౌజన్యను వివాహం చేసుకుంటే వారి కుటుంబానికి చెందిన దాదాపు రూ. 25 కోట్ల భారీ ఆస్తి తనకు దక్కుతుందని సాధిక్ ఆశపడ్డాడు. ఈ దురాశతోనే అతడు జగదీశ్వరరెడ్డిని అంతమొందించడానికి స్కెచ్ వేసినట్లు విచారణలో అంగీకరించాడు.
Also Read :స్థానిక సమరానికి జగన్ భయపడుతున్నాడా..?
మొదట్లో పోలీసుల ఎదుట ఏమీ తెలియదని బుకాయించిన సాధిక్ ఖాన్, పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు సైనైడ్ విక్రయించిన వారి సాక్ష్యాలను ముందు పెట్టడంతో లొంగిపోయాడు. జగదీశ్వరరెడ్డిని చంపాలనే ఉద్దేశంతో ఒకసారి విషపదార్థాన్ని కొబ్బరి నీళ్లలో కలిపి ఇచ్చినట్లు వెల్లడించాడు. అంతేకాకుండా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా సుమారు 3 నుంచి 4 సార్లు విషాన్ని అందించినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో కొంత కోలుకుని ఇంటికి వచ్చిన జగదీశ్వరరెడ్డికి మళ్లీ సైనైడ్ పంపించగా, దాన్ని ఉపయోగించిన మరుసటి రోజే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
Also Read : భారీ ఫీచర్లతో మార్కెట్లోకి మారుతి సుజుకి బాలెనొ ఫేస్‌లిఫ్ట్..!
జగదీశ్వరరెడ్డి మరణం తర్వాత ఆస్తిని తన వశం చేసుకోవాలని సాధిక్ ప్రయత్నించగా, దానికి సౌజన్య తండ్రి ఏఈ నూకరాజు పూర్తిగా నిరాకరించారు. ఆస్తి మొత్తాన్ని మనవడు కార్తికేయ పేరిట రాస్తామని తెగేసి చెప్పడంతో ఆగ్రహించిన సాధిక్, “ఆస్తి కోసమే నేను ఇదంతా చేశాను, ఇప్పుడు మీరు ఇలా చేస్తే ఊరుకోను” అంటూ వారిని తీవ్రంగా వేధించి, చంపేస్తానని బెదిరించాడు. ఈ మానసిక వేధింపులు మరియు భయం తట్టుకోలేకనే ఏఈ నూకరాజు ఫ్యామిలీ రాజమండ్రి గోదావరి వారధి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం పోలీసులు సాధిక్ ఖాన్ ఉపయోగించిన విష పదార్థ నమూనాలను సీజ్ చేసి, కేసును పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నారు.

