న్యూఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది. ఈ నెల మూడో వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగిసిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని భారీగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా మంత్రుల పనితీరుపై నిశితంగా కసరత్తు చేస్తున్న మోదీ.. ఈసారి ఏకంగా సగానికి పైగా మంత్రులను పక్కనపెట్టి, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : డీఎస్సీ వార్.. ఆరోపణలు సరే.. ఆధారాలేవి..?
ఇప్పటికే క్యాబినెట్, సహాయ మంత్రుల నివేదికలను ప్రధాని సమీక్షించారని, పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలకడం దాదాపు ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదిత మార్పుల వెనుక కేంద్ర ప్రభుత్వం ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే బ్రిక్స్ సదస్సు ముగిసిన వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల షెడ్యూల్, అలాగే ఈ ప్రక్షాళనపై ప్రధాని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని అధికారపక్షం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
Also Read : మెగా ఫ్యామిలీకి వరుసగా కీలక పదవులు..!
ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలం మరియు మద్దతు ఇప్పటికే లభించిందని, దీంతో పార్లమెంట్ వేదికగా కీలక బిల్లులు చట్టాలుగా మారే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మరో సంచలన ట్విస్ట్ ఏంటంటే.. ఎన్డీయే కూటమిలోకి కొత్త భాగస్వామ్య పక్షాలు చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా డీఎంకే, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాలు ఎన్డీయే తీర్థం పుచ్చుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇవి కూటమిలో చేరితే, కేంద్ర మంత్రివర్గంలో ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలకు ప్రాధాన్యత కలిగిన పదవులు దక్కడం ఖాయం. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ సమీకరణాలు, పన్నెండు భాషల ప్రతినిధుల ప్రాతినిధ్యాన్ని సమతూకం చేస్తూ ప్రధాని మోదీ ఈ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

