సోషల్ మీడియా సెలబ్రిటీ, ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ రమానందన చుట్టూ గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లండన్ వీసాల పేరుతో కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె, బ్రిటన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. లుకౌట్ నోటీసులు ఉన్నాయంటూ రన్ అయిన బ్రేకింగ్ న్యూస్‌లు చూసి ఆమె అరెస్ట్ ఖాయమని అందరూ భావించారు.
Also Read : డీఎస్సీ వార్.. ఆరోపణలు సరే.. ఆధారాలేవి..?
అయితే, సీన్ కట్ చేస్తే అక్కడ ఎలాంటి అరెస్టూ జరగలేదు, భవిష్యత్తులో కూడా అంత ఈజీగా కఠిన చర్యలు ఉంటాయనే గ్యారెంటీ కనిపించడం లేదు. కేవలం స్టేషన్‌కు పిలిపించి, లీగల్ నోటీసులు ఇచ్చి పంపించేయడంతో ఈ వ్యవహారం అంతా ఊరికే చేసిన హంగామానా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కరెక్ట్‌గా ఈ టైమ్‌లోనే ఆమె ఇండియాలో ల్యాండ్ అవ్వడం, పోలీసులు ఇంతలా సీన్ క్రియేట్ చేయడం వెనుక ఒక సంచలన ట్విస్ట్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది.
Also Read : వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి చిన్న శ్రీను..!
ప్రస్తుతం బుల్లితెరపై పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నడుస్తుండటంతో, నందు ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు ఊపందుకున్నాయి. సాధారణంగా వివాదాలు, నెగిటివ్ పబ్లిసిటీ ఉన్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా షో రేటింగ్‌లు పెంచేందుకే, పోలీసుల లీగల్ నోటీసుల వ్యవహారాన్ని ఒక భారీ పబ్లిసిటీ స్టంట్‌గా మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు పోగొట్టుకుని బాధితులు రోడ్డున పడితే, ఈ వివాదాన్ని ప్రమోషన్ల కోసం వాడుకోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ అనే వార్త కేవలం ఊహాగానంగానే మిగిలిపోవడంతో, బాధితులకు అసలు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

