Monday, August 17, 2026 09:00 PM
Monday, August 17, 2026 09:00 PM

భారత్‌లోకి కియా సోరెంటో గ్రాండ్ ఎంట్రీ..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ‘కియా సోరెంటో’ ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 4, 2026న ఈ ప్రీమియం కారు అధికారికంగా లాంచ్ కాబోతున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కియా సంస్థ నుండి భారతదేశంలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో వస్తున్న మొట్టమొదటి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మోడల్ ఇదే కావడం విశేషం. ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కియా బ్రాండ్ ఇమేజ్‌ను ఈ కారు మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు.

Also Read : బ్యాలెట్ విధానంలోనే స్థానిక ఎన్నికలు..!

ఈ కియా సోరెంటో కారులో పవర్‌ఫుల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లను అందిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ ప్రకారం చూస్తే ఇందులో 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పాటు, కియా కార్నివాల్‌లో వాడే 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌ను కూడా ఇచ్చే అవకాశం ఉంది. వీటికి తోడు ఈ మోడల్‌లో ‘లైవ్ జెన్ ఏఐ’ పేరుతో సరికొత్త ఏఐ ఆధారిత ఇన్-కార్ వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీని కూడా జోడించారు. దీనివల్ల డ్రైవర్ లేదా ప్రయాణికులు కారుతో సహజంగా మాట్లాడుతూనే లోపల ఉండే పలు ఫీచర్లను వాయిస్ కమాండ్స్ ద్వారా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.

Also Read : విజయ్ ఇంటి పక్కనే త్రిష కొత్త ఇల్లు..?

భారతదేశంలోనే ఈ కారును భారీగా లోకలైజ్ చేస్తుండటం వల్ల దీని ధర ఎక్స్-షోరూమ్ సుమారు రూ.30 లక్షల నుండి రూ.35 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. వేరియంట్లు మరియు ఫీచర్లను బట్టి కొన్ని మోడళ్ల ప్రారంభ ధర రూ.40 లక్షల వరకు కూడా వెళ్లవచ్చని మార్కెట్ అంచనా. మార్కెట్లోకి వచ్చాక ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఫీచర్ కలిగిన ఫోక్స్‌వ్యాగన్ టేరన్, స్కోడా కొడియాక్ మరియు జీప్ మెరిడియన్ వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాగబాబు.. ఇక నుంచి...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

ఇంటింటికి తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

భోగాపురంలో ల్యాండ్ అయిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ...

నోటీసులకు జవాబు ఇవ్వాలి.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల...

బ్యాలెట్ విధానంలోనే స్థానిక...

ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు...

పోల్స్