ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య విడుదలైన వర్సటైల్ హీరో సూర్య తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్‌తో దూసుకుపోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సినిమాలో సూర్య, మమితా బైజుల స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు ప్రేక్షకులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న మరో క్యూట్ క్యారెక్టర్.. సంజయ్ విశ్వనాథ్ కొడుకు అభయ్ పాత్ర. ఈ సినిమాలో తన బుజ్జి బుజ్జి ఎక్స్ప్రెషన్స్, నేచురల్ యాక్టింగ్‌తో థియేటర్లలో అందరినీ మురిపించిన ఆ బుడ్డోడి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
Also Read : అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్ సరదా పంచ్‌లు..!
సినిమాలో అభయ్‌గా కనిపించిన ఈ పిల్లాడి అసలు పేరు చార్విక్. ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగేంత వరకు ఈ బాబు ఎవరో సెలబ్రిటీల పిల్లాడే అనుకున్నారు కానీ, అసలు నిజం ఏంటంటే చార్విక్ ఒక సామాన్య కుటుంబానికి చెందిన పిల్లాడు. ఈ సినిమా కోసం 6 నెలల నుండి ఏడాది వయసున్న పిల్లలు కావాలని మేకర్స్ కాస్టింగ్ కాల్ ఇవ్వడంతో.. చార్విక్ తల్లిదండ్రులు బాబును ఆడిషన్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎంతోమంది పిల్లలు కెమెరా మరియు లైట్లను చూసి ఏడుస్తుంటే, చార్విక్ మాత్రం ఎంతో హుషారుగా నవ్వుతూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడట.
Also Read : విజయ్ ఇంటి పక్కనే త్రిష కొత్త ఇల్లు..?
కెమెరా భయం లేకుండా నవ్వుతూ కనిపించిన చార్విక్ క్యూట్‌నెస్‌కు ముగ్ధులైన దర్శకుడు వెంకీ అట్లూరి వెంటనే బాబును ఈ రోల్ కోసం సెలెక్ట్ చేశారు. షూటింగ్ సమయంలో కూడా హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి చార్విక్ను తమ సొంత కొడుకులా ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకున్నట్లు బాబు పేరెంట్స్ తెలిపారు. అందుకే స్క్రీన్‌పై సూర్య, చార్విక్ మధ్య వచ్చే సీన్లు అంత నేచురల్‌గా పండాయి. ఈ క్యూట్ ఎమోషన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కథ పరంగా సరోగసి పద్ధతిలో పుట్టిన కొడుకు ప్రాణాలను కాపాడుకునేందుకు 42 ఏళ్ల బిజినెస్ టైకూన్ సంజయ్ విశ్వనాథ్ పడే తపన, ఆపై మమితా బైజుతో సాగే ఈ ఎమోషనల్ జర్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.11 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది.

