Thursday, October 1, 2026 09:51 PM
Thursday, October 1, 2026 09:51 PM

భోగాపురంలో ల్యాండ్ అయిన తొలి విమానం..!

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విమానాశ్రయ రన్‌వేపై తొలి కమర్షియల్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయి సరికొత్త చరిత్రను సృష్టించింది. హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం మొదటిసారిగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని వీక్షించేందుకు విమానాశ్రయ అధికారులు, సిబ్బంది ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

Also read : బీసీసీఐలో వీవీఎస్ లక్ష్మణ్‌కు మోస్ట్ పవర్‌ఫుల్ పోస్ట్..?

తొలి విమానంలో భోగాపురం చేరుకున్న ప్రయాణికులకు విమానాశ్రయ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. రన్‌వేపై ల్యాండ్ అయిన విమానానికి సంప్రదాయబద్ధంగా వాటర్ సెల్యూట్ సమర్పించారు. టెర్మినల్ బిల్డింగ్‌లోకి అడుగుపెట్టిన ప్రయాణికులను ప్రత్యేకంగా అభినందిస్తూ, శాలువాలు కప్పి లోపలికి ఆహ్వానించారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన మొదటి బ్యాచ్ ప్రయాణికులుగా తాము నిలవడంపై ప్రయాణికులు సైతం ఎంతో హర్షం మరియు ఆనందం వ్యక్తం చేశారు.

Also read : బంగ్లాదేశ్‌ ను భారత్ ఆదుకుంటుందా..?

ఈ స్వాగత వేడుకల్లో భాగంగా అధికారులు ఉత్తరాంధ్ర సంస్కృతి, కళలకు అద్దం పట్టేలా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రయాణికులందరికీ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మన ఏపీ స్థానిక హస్తకళా నైపుణ్యమైన ఏటికొప్పాక చెక్క బొమ్మలను ప్రత్యేక జ్ఞాపికలుగా అందజేశారు. ఈ అపురూపమైన కానుకలను అందుకున్న ప్రయాణికులు అధికారుల ఆతిథ్యానికి ముగ్ధులయ్యారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

పోల్స్