Wednesday, November 18, 2026 09:52 AM
Wednesday, November 18, 2026 09:52 AM

ఈరోజు రాశి ఫలితాలు (17-08-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, శుక్ల పక్షం.. 17-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

అనుకోని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకోని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలలో పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

—————————————

వృషభం

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలున్నవి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది.

—————————————

మిధునం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి.రుణ ఒత్తిడి పెరిగి వలన మానసికంగా స్థిమితం ఉండదు. వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయటా నూతన సమస్యలు కలుగుతాయి . వ్యాపారాలు నిలకడ రాణించవు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

—————————————

కర్కాటకం

సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములున్నవి.

—————————————

సింహం

ఇంటా బయట గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులను పొందుతారు.

—————————————

కన్య

సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు.

—————————————

తుల

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

—————————————

వృశ్చికం

కీలక వ్యవహారాలలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులుంటాయి. మిత్రుల నుండి ఊహించని ఋణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విషయాలలో భాగస్థులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి . ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

—————————————

ధనస్సు

అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున సమస్యలు పరిష్కారమౌతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

—————————————

మకరం

జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అధిక కష్టంతో స్వల్ప ఫలితం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

—————————————

కుంభం

నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతవరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

—————————————

మీనం

ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. బంధువర్గంతో విభేదాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆ నలుగురే టీటీడీ...

తిరుమ తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్...

నా కూతురి పెళ్లి...

తన కుమార్తె వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన...

భారత క్రికెట్ చరిత్రలో, ముఖ్యంగా ఐపీఎల్...

విజయ డెయిరీలో ఏం...

కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర...

జగన్ ఫేక్ ట్వీట్‌కు...

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై...

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

పోల్స్