Saturday, August 15, 2026 04:20 PM
Saturday, August 15, 2026 04:20 PM

బీసీసీఐలో వీవీఎస్ లక్ష్మణ్‌కు మోస్ట్ పవర్‌ఫుల్ పోస్ట్..?

భారత క్రికెట్ నియంత్రణ మండలిలో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్‌కు బోర్డు అత్యంత కీలకమైన పదవిని అప్పగించనుంది. ఆయనను బీసీసీఐ సరికొత్తగా ప్రవేశపెడుతున్న ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా నియమించబోతున్నట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. లక్ష్మణ్ కాంట్రాక్టును మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ, ఈ సరికొత్త హోదాను కల్పించనున్నారు.

Also Read : ఉద్యోగం కావాలా.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాగోతం..!

ఈ కొత్త పదవితో భారత క్రికెట్‌లోని సీనియర్ కోచ్‌లు, సెలెక్టర్లు, యూత్ డెవలప్‌మెంట్ మరియు ప్లేయర్స్ రిహాబ్ వంటి అన్ని విభాగాలు లక్ష్మణ్ పర్యవేక్షణలోకి రానున్నాయి. అయితే, ఈ తాజా మార్పుతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌ల స్థానాలపై భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది. కొత్త నియామకం ప్రకారం.. బీసీసీఐ అధికారిక శ్రేణిలో లక్ష్మణ్ పదవి గంభీర్, అగార్కర్ ఇద్దరి కంటే పైస్థానంలో ఉండబోతోంది.

Also Read : జెన్ జీ.. లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు దూరమా..? తాజా సర్వేలో షాకింగ్ నిజాలు..!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం వెనుకబడి ఉండటం వల్ల గంభీర్ రెడ్-బాల్ కోచింగ్ భవిష్యత్తుపై విమర్శలు వస్తుండగా, రోహిత్, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అగార్కర్ పదవీకాలంపై కూడా చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ గంభీర్, అగార్కర్‌ల తక్షణ పదవులకేమీ ఢోకా లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్ ముగిసే వరకు తమ ప్రస్తుత బాధ్యతల్లోనే కొనసాగుతారని సమాచారం. లక్ష్మణ్ ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జాతీయ జట్టు కోచింగ్ స్టాఫ్, సెలెక్టర్ల నియామక ప్రక్రియను మరింత పటిష్టంగా మరియు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బంగ్లాదేశ్‌ ను భారత్...

భారతదేశం నుండి అదనంగా డీజిల్ సరఫరా...

తొలిరోజే 31 విమానాలు.....

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం...

జోగి సీటు చిరిగినట్లేనా.....

జోగి రమేష్.. ఈ పేరు పెద్దగా...

మళ్లీ కొత్త పాట...

ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.....

ఏపీలో మద్యం ధరలు...

ఆంధ్రప్రదేశ్‌లో నూతన రిటైల్ ఎక్సైజ్ విధానం...

ఎన్టీఆర్ అభిమాని కొడుక్కి...

తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ భక్తి...

పోల్స్