Friday, October 2, 2026 04:37 AM
Friday, October 2, 2026 04:37 AM

ఈరోజు రాశి ఫలితాలు (15-08-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాడ మాసం, బహుళ పక్షం.. 15-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

—————————————

వృషభం

ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు.

—————————————

మిధునం

సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి.

—————————————

కర్కాటకం

సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

సింహం

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

—————————————

కన్య

దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి.

—————————————

తుల

కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి,ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

—————————————

వృశ్చికం

సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

ధనస్సు

సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

—————————————

మకరం

ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

—————————————

కుంభం

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు.

—————————————

మీనం

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణ సంబంధిత సమస్యల వలన ఒత్తిడి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

పోల్స్