అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేస్తున్న కవ్వింపు చర్యలకు భారతదేశం అత్యంత వ్యూహాత్మకంగా, గట్టిగా బుద్ధి చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 కీలక ప్రాంతాలకు చైనా తన సొంత భాషలో కల్పిత పేర్లు పెడుతూ, దొంగ మ్యాపులను సృష్టిస్తూ అంతర్జాతీయంగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. అయితే, ఈసారి కేవలం మాటలతో సరిపెట్టకుండా భారత్ ఆచరణలో తనేంటో చూపించింది. చైనా సృష్టించిన కల్పిత అబద్ధాలకు శాశ్వతంగా తెరదించుతూ, సర్వే ఆఫ్ ఇండియా తన అధికారిక మ్యాప్‌లో ఆ 27 ప్రాంతాలను స్థానిక చారిత్రక ఆధారాలతో కూడిన అసలైన భారతీయ పేర్లతో స్పష్టంగా గుర్తిస్తూ సరికొత్త మార్కింగ్ ఇచ్చింది.
Also Read : నేను సీఎంతోనే ఉంటా.. విడాకుల కేసులో ట్విస్ట్..!
సరిహద్దుల్లో ఖచ్చితమైన గుర్తింపు మరియు పరిపాలనాపరమైన స్పష్టత కోసమే అధికారిక మ్యాప్‌లో ఈ మార్పులు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్య ద్వారా చైనా అక్రమ వాదనలకు అంతర్జాతీయ వేదికలపై ఇక ఏమాత్రం విలువుండదు. భవిష్యత్తులో ఏ గ్లోబల్ మ్యాపింగ్ సంస్థ అయినా లేదా అంతర్జాతీయ సమాజమైనా భారత్ విడుదల చేసిన.. ఈ అధికారిక రికార్డులనే ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. శత్రువుల ఆటలను సాగనివ్వకుండా, దేశ రక్షణ కోసం మరియు సరిహద్దు రేఖను భద్రపరచడం కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యంత సాహసోపేతమైన, పకడ్బందీ వ్యూహంతో ఈ అడుగు వేసింది.
Also Read : పోలీసులను టార్గెట్ చేసిన ట్రైనీ ఐపీఎస్..? తలనొప్పిగా విచారణ..!
ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా భారత్ చైనాకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఇది 1962 నాటి బలహీనమైన దేశం కాదని, ప్రతి అంగుళం భూమిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్న నవభారతమని తేల్చిచెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో ఒక అంతర్భాగమేనని, శత్రుదేశం ఎన్ని కల్పిత ప్రచారాలు చేసినా ఈ వాస్తవాన్ని మార్చలేరని న్యూఢిల్లీ మరోసారి ఖరాకండిగా స్పష్టం చేసింది. సరిహద్దుల్లోని వ్యూహాత్మక పర్వత కనుమలు, గ్రామాలు మరియు సైనిక పుణ్యక్షేత్రాలకు ఖచ్చితమైన గుర్తింపునిచ్చిన ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యూక్తం అవుతోంది.

