Friday, August 7, 2026 07:14 PM
Friday, August 7, 2026 07:14 PM

కవితను లైట్ తీసుకున్న బీఆర్ఎస్..!

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీష్ రావుతో విభేదించిన మాజీ ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త పార్టీ పెట్టి తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కవిత కొత్త ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత, కొత్తగా రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత ఆమెను ముందుగా టార్గెట్ చేసిన కేవలం భారత రాష్ట్ర సమితి శ్రేణులే. ఇంకా చెప్పాలంటే కవితపై వ్యక్తిత్వ హననం కూడా చేశారు. ఇంటిపేరు మార్చుకోవాలన్నారు. ఆ తర్వాత నీచమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అయితే.. కవితకు టీఆర్ఎస్ అనే పేరు వచ్చేలా గుర్తింపు ఇవ్వద్దు అంటూ ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికే వెయ్యికి పైగా లేఖలు రాశారు.

Also Read : కొరియన్ కనకరాజు రివ్యూ : కొరియా దెయ్యం కట్టిపడేసిందా..?

అయితే తాజాగా కవిత విషయంలో గులాబీ పార్టీ సైలెన్స్ పాటిస్తుంది. కవిత విషయంలో కనీసం స్పందించడం లేదు. ఓ వైపు బీఆర్ఎస్ పై కవిత తీవ్ర విమర్శలు చేస్తున్నా కూడా చూసీ చూడనట్టుగా విడిచిపెడుతున్నారు. పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే గులాబీ పార్టీ నేతలు కవితపై విమర్శలు చేసిన సందర్భాలు లేవు. కానీ అదే సమయంలో కవిత మాత్రం గులాబీ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేటీఆర్‌తో పాటు హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. అంత చేస్తున్న గులాబీ పార్టీ నేతల మౌనం వెనుక ఉన్న వ్యూహం అనేది ఏంటో అర్థం కావడం లేదు.

కవిత విషయంలో గులాబీ పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కవిత ఎటువంటి వ్యాఖ్యలు చేసినా సరే రెచ్చిపోవద్దని.. దానికి కౌంటర్లు ఇవ్వొద్దు అంటూ పార్టీ నాయకులందరినీ సూచించినట్లు సమాచారం. కవితను మౌనంతోనే దెబ్బతీయాలన్నది పార్టీ ప్రణాళికగా అర్థమవుతోంది. కవితను ఎంత రెచ్చగొడితే.. ఆమె అంత తీవ్రంగా మాటలు దాడి చేసి.. తమకు రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తారని భారత రాష్ట్ర సమితి నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కవితను రెచ్చగొట్టడం కంటే కూడా.. సైలెంట్‌గా ఉండడమే మేలు అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్ని రకాల విమర్శలు ఎదురైనా సరే పట్టించుకోవద్దనే ఆదేశాలు నాయకత్వం నుంచి వచ్చినట్లు సమాచారం.

కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన తొలినాళ్లలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో మాజీ మంత్రులపై కూడా వ్యక్తిగత విమర్శలు చేశారు. జగదీశ్వర్ రెడ్డి తో పాటు పలువురు సీనియర్లు కవిత విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. గులాబీ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ప్రాణం ఉండగా తాను ఇక బీఆర్ఎస్‌లోకి వెళ్లేది లేదని కూడా తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా సొంత పార్టీని ఏర్పాటు చేశారు.

Also Read : మోసాద్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఇరాన్.. గేమ్స్ కు చెక్..!

ప్రధానంగా కవిత గులాబీ పార్టీ పైనే ఫోకస్ చేశారు. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆ చేరికలు లేవు. ఇతర పార్టీల నుంచి కూడా కవిత పార్టీలో చేరిన నాయకులు కనిపించడం లేదు. ఈ తరుణంలో అనవసరంగా కవితను హైలైట్ చేసి.. బలోపేతం చేయకూడదు అనేది కేసీఆర్ వ్యూహం. కవిత వ్యాఖ్యలతో సెంటిమెంటు మరింత ఎగసిపడి.. రాజకీయంగా తమకు లాభిస్తుంది అనేది కేసీఆర్ అంచనా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఆమె వ్యాఖ్యలు, విమర్శలు ఉంటే.. ఆమె వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ ఆలోచన. అందుకే కుమార్తె విషయంలో వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు కేసీఆర్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జనసేన జెండా కోసం...

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా...

ఈవీఎంలకు వ్యతిరేకంగా కాక్రోచ్...

ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నీట్...

బెజవాడ మేయర్ పీఠంపై...

ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభం...

ఎలా చెబితే అర్థం...

సాధారణంగా ఒక నానుడి ఉంది. అదేమిటంటే.....

ఇంట్రస్టింగ్ గా సీఎం...

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం...

పక్కన పెడతారా.. ఉద్యమిస్తారా..?...

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర...

పోల్స్