Thursday, August 6, 2026 07:32 PM
Thursday, August 6, 2026 07:32 PM

స్కూల్స్ వద్ద నో జంక్ ఫుడ్.. గవర్నమెంట్ ఆర్డర్..!

బడి ఈడు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా మహారాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాల ప్రాంగణాల్లో, వాటికి 50 మీటర్ల పరిధిలో కూడా జంక్ ఫుడ్.. కొవ్వులు, షుగర్, సాల్ట్ అధికంగా ఉండే పదార్థాలు విక్రయాలు, ఉచిత పంపిణీ, ప్రకటనలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, పాఠశాలల్లో నిర్వహించే క్యాంటీన్లకు ఆహార భద్రతా లైసెన్సులను తప్పనిసరి చేసింది.

Also Read : వెంటాడుతున్న ED.. వేల కోట్ల స్కామ్‌లో వైసీపీ సీనియర్‌ నేత

చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం, ఇతర జీవనశైలి సమస్యలను అరికట్టేందుకు ఈ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చారు. నూతన ఆదేశాల ప్రకారం.. మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వడాపావ్, సమోసాలతో పాటు నూనెలో వేగించిన తిను బండారాలు, చిప్స్, కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లను పాఠశాలల్లో లేదా వాటి సమీపంలో విక్రయించకూడదు. స్టేట్ బోర్డ్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి బోర్డులతో సంబంధం లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. దీనివల్ల దాదాపు రెండు కోట్లకు పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Also Read : రసవత్తరంగా స్థానిక పోరు.. కూటమి పార్టీల సిగపట్లు..!

అలాగే బడులలో క్యాంటీన్లు నడిపే వెండర్లు తప్పనిసరిగా ఎఫ్‌డిఏ నుంచి అధికారిక లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. పాఠశాల యాజమాన్యాలే స్వయంగా క్యాంటీన్ నడిపినా లైసెన్స్ తీసుకోవడం విధిగా మారింది. చిన్నారుల నుంచి 17 ఏళ్ల టీనేజర్ల వరకు అందరికీ పోషకాహారంతో కూడిన సురక్షిత ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనల అమలు బాధ్యతను హెచ్ఎంలు, పాఠశాల యాజమాన్యాలకే అప్పగించారు. నిబంధనల ఉల్లంఘనలను పసిగట్టేందుకు ఎఫ్‌డిఏ ఇన్స్‌పెక్టర్లు ఏడాదికి కనీసం రెండుసార్లు ప్రతి పాఠశాలను తనిఖీ చేస్తారని, నిబంధనలు దాటితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. అదే సమయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు జిల్లా, తాలూకా స్థాయిలో వర్క్ షాప్లు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పక్కన పెడతారా.. ఉద్యమిస్తారా..?...

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర...

పొగాకు రైతులపై జగన్‌...

దేవరాపల్లిలో వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు...

వైసీపీ ఫేక్ ప్రచారానికి...

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం...

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం...

వెంటాడుతున్న ED.. వేల...

వైసీపీ నేతలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ -...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది....

పోల్స్