Wednesday, July 29, 2026 06:30 AM
Wednesday, July 29, 2026 06:30 AM

బాలయ్య ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయబోతున్న కొరటాల..!

నటసింహం నందమూరి బాలకృష్ణ వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. గత ఏడాది చివర్లో అఖండ-2 చిత్రంతో థియేటర్లలో అలరించిన ఆయన, ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ చిత్రంలో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్‌ లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

Also Read : మేమూ బాధితులమే.. తమ్మినేని కొత్త డ్రామా..!

అయితే, ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో ఊహించని విధంగా బాలకృష్ణకు గాయం కావడం, ఏఐజీ హాస్పిటల్స్ వైద్యులు ఆయనకు విజయవంతంగా సర్జరీ చేయడంతో ప్రస్తుతం షూటింగ్‌ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గోపీచంద్ మలినేని చిత్రంతో పాటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ తన 112వ చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గత నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. అయితే, బాలయ్యకు సర్జరీ జరిగి ప్రస్తుతం బెడ్ రెస్ట్ అవసరం కావడంతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ షెడ్యూల్ కూడా వాయిదా పడింది.

Also Read : రంగనాథ్‌ను తొలగిస్తారా.. లేక కొనసాగిస్తారా..?

మొదట ఆగస్టు చివరి వారంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్‌ను ప్రారంభించాలని చిత్రబృందం భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ షూటింగ్‌ను సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేశారట. ఈ క్రమంలో సమయం ఏమాత్రం వృథా కాకూడదని భావించిన దర్శకుడు కొరటాల శివ ఒక పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. బాలకృష్ణ లేని కీలక సన్నివేశాలను, ఇతర నటీనటులపై వచ్చే సీన్లను ముందుగా చిత్రీకరించి, ఆయన పూర్తిగా కోలుకుని సెట్స్‌పైకి వచ్చిన తర్వాత బాలయ్య సీన్లను ప్లాన్ చేయాలని నిర్ణయించారు. బాలకృష్ణను పూర్తిస్థాయి ఊరమాస్ అవతార్‌ లో చూపిస్తూనే, మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగేలా ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశారని ఇండస్ట్రీ టాక్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అల్లు అర్జున్ సంచలన...

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

జగన్ ట్రాప్ లో...

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం...

మేమూ బాధితులమే.. తమ్మినేని...

భూ వ్యవహారానికి సంబందించి తన కుటుంబ...

రంగనాథ్‌ను తొలగిస్తారా.. లేక...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

జగన్ రెస్పాండ్ అవుతారా.?...

ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి, విపక్షం...

రామాలయానికి తొలగిన అడ్డంకి..!

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ...

పోల్స్