Friday, September 4, 2026 11:10 PM
Friday, September 4, 2026 11:10 PM

ఆ విషయంలో పవన్ గ్రాండ్ సక్సెస్..!

రాజకీయాలు ఇలానే ఉండాలని లేదు. ఒకే విధంగా ఉంటే వాటిని రాజకీయాలు అనరు. చాణక్య నీతి ఆధారంగా రాజకీయాలు సాగుతూ ఉంటాయి. రాజకీయం అంటేనే పరమపద సోపానం లాంటిది. నిచ్చెనలు.. పాములు.. ఇలా చాలా ఉంటాయి. ఇందులో తెలివిగా వ్యవహరించిన వారు మాత్రమే పరమపద సోపానంలో విజయం సాధించగలుగుతారు. గతంలో ఏపీ రాజకీయాలలో వైసీపీ అధినేత రకరకాల వ్యూహాలు రచించేవారు. ఆయన వెంట నాడు విజయసాయిరెడ్డి.. వంటి నాయకులు, ఆర్థిక నిపుణులు ఉన్నారు. వారు తమ బుర్రకు పదును పెట్టి ఆలోచనలు చేశారు. వాటిని జనంలోకి తీసుకెళ్లేవారు జగన్. తద్వారా నాడు టిడిపి ప్రభుత్వానికి.. జనసేన పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం కలిగించేవారు.

Also Read : అమరావతిలో కూటమి కీలక సమావేశం..!

2019 ఎన్నికల సమయానికి జగన్ వేసిన ఉచ్చులోనే టీడీపీ,జనసేన పార్టీల అధినేతలు చిక్కుకున్నారు. అందువల్లే జగన్ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీడీపీ తరఫున మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడేవారు. కేవలం పవన్ కళ్యాణ్, జగన్‌ను మాత్రమే నాడు మహాసేన రాజేష్ విమర్శించేవారు. చంద్రబాబును ఒక్క మాట కూడా అనలేదు. ఇటీవల ప్రశ్న రావణ్ కూడా ఏపీ సీఎం, ఐటీ మంత్రిని ఒక్క మాట అనలేదు. కేవలం పవన్ కళ్యాణ్ మీద మాత్రమే దాడి చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడాడు. జడ శ్రావణ్ కూడా జనసేన అధినేతను టార్గెట్ చేసుకొనే విమర్శించారు. ఎప్పుడూ ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను విమర్శించలేదు.

రావణ్, జడ శ్రావణ్ వ్యవహార శైలి రోజురోజుకు దారుణంగా మారుతున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. జనసేన నాయకులకు కడుపు రగిలిపోయింది. పవన్ కళ్యాణ్ నుంచి ఆదేశాలు రావడంతో వారు కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఫలితంగా పోలీసులు కేసులు కట్టి రావణ్ మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఒకరకంగా పోలీసులకు అరెస్ట్ చేసే పరిస్థితి మాత్రమే కల్పించి.. తాను ఏంటో నిరూపించుకున్నారు పవన్. ఈ విషయంలో టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ మాటకు ఊ కొట్టడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడడంతో రావణ్ లాంటి వాళ్ళు ఇప్పుడు నోరు మూసుకొని కూర్చున్నారు.

Also Read : భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్..!

వాస్తవానికి ప్రశ్న రావణ్, జడా శ్రవణ్ లాంటి వల్ల వైసీపీకి పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే వైసీపీకి ఇప్పటికే దళిత క్రైస్తవులు ఓట్లు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో కొంత మాత్రమే తగ్గాయి. ఎస్సీ, ఎస్టీలు కూడా జగన్‌ మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు. అలాంటప్పుడు జడా శ్రావణ్ విషయంలో, రావణ్ విషయంలో జగన్ ఎందుకు తొందర పడుతున్నారు..? ఎందుకు వకాల్తా పుచ్చుకుంటున్నారో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ వేసిన ట్రాప్‌లో పడి జగన్ ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో హిందువుల పట్ల జగన్‌ మోహన్ రెడ్డిని విలన్‌లా చిత్రీకరించే ప్రయత్నాన్ని పవన్ విజయవంతంగా పూర్తి చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వివేకా హత్య కేసులో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

నేను సీఎం అవుతా.....

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రాంతీయ పార్టీ...

ఇంటింటికీ తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం రెండేళ్ల...

జనంలోకి జగన్.. పాదయాత్ర...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల వేడి...

కొండా సురేఖ సంచలన...

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ...

బొండా ఫ్యామిలీకి చంద్రబాబు...

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నగారా...

పోల్స్