సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మానవాళికి ఒక పెద్ద భద్రతా సవాల్‌గా మారుతోంది. పాకిస్తాన్ కేంద్రంగా భారత్ పై నిరంతరం కుట్రలు పన్నే నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, తమ కేడర్ కు ఏఐ సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. భారత నిఘా సంస్థలు సేకరించిన ఒక నిఘా వీడియోలో, లష్కరే తోయిబా టాప్ కమాండర్ రాణా మహ్మద్ అష్ఫాక్ తమ ఉగ్రవాదులను ఉద్దేశించి “మన శత్రువు సాంకేతిక రంగంలో మనకంటే చాలా ముందున్నాడు, కాబట్టి ‘ముజాహిదీన్లు’ కూడా ఆధునిక ఏఐ టూల్స్ మరియు టెక్నాలజీని నేర్చుకోవడం అత్యంత అవసరం” అని పిలుపునివ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.
Also Read : రాయనపాడు.. రెడీ ఫర్ స్టార్ట్..!
ఉగ్రవాదులు నేరుగా సరిహద్దులు దాటడం కంటే, సైబర్ దాడులు చేయడం మరియు డిజిటల్ ప్రచారాలు నిర్వహించడానికి ఈ ఏఐని ఎక్కువగా ఉపయోగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని కీలకమైన ప్రభుత్వ వెబ్ సైట్లు, రక్షణ రంగానికి చెందిన నెట్వర్క్ లను హ్యాక్ చేయడం వంటి సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అలాగే, సముద్ర మార్గాల ద్వారా దేశంలోక శత్రువుల చొరబాట్లను పర్యవేక్షించడానికి, ప్లాన్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడే ముప్పు ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.
Also Read : ఏజెన్సీపై స్పెషల్ ఫోకస్..!
ప్రసిద్ధ అంతర్జాతీయ థింక్ ట్యాంక్ ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ విశ్లేషణ ప్రకారం.. ఉగ్రవాదులు మార్కెట్లో ఉచితంగా దొరికే ఓపెన్-సోర్స్ ఏఐ మోడల్స్, డీప్‌ఫేక్ జనరేటర్స్ మరియు చాట్ బాట్స్ ను వాడుకుంటూ అత్యంత తక్కువ ఖర్చుతో నకిలీ ఆడియోలు, వీడియోలు సృష్టించి, సోషల్ మీడియాలో ఆటోమేటెడ్ బాట్స్ ద్వారా యువతను ఆకర్షించడానికి ప్లాన్ చేస్తున్నారు. హాఫిజ్ సయీద్ నేతృత్వంలోని ఈ లష్కరే తోయిబా సంస్థ గతంలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఘోర ఉగ్రదాడికి పాల్పడినట్లు గుర్తించారు.

