ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ భారత్ సహా ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీ నిస్సాన్ టెక్టాన్ ను నిన్న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. నిస్సాన్ ఇండియా చేపట్టిన వన్ కార్, వన్ వరల్డ్ వ్యూహంలో భాగంగా వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఈ సరికొత్త ఎస్‌యూవీని మనదేశంతో పాటు ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్ల కోసం చెన్నైలోని రేనాల్ట్-నిస్సాన్ ప్లాంట్ లోనే ప్రత్యేకంగా తయారు చేయనున్నారు.
Also Read : మొబైల్ టవర్స్ అవసరం లేదు.. బీఎస్ఎన్ఎల్ క్రేజీ శాటిలైట్ ఫోన్..!
ఈ సరికొత్త టెక్టాన్ ఎస్‌యూవీని రేనాల్ట్ డస్టర్ ప్లాట్ ఫారమ్ పైనే నిర్మిస్తున్నప్పటికీ, దీని డిజైన్ మాత్రం నిస్సాన్ బ్రాండ్ కి చెందిన గ్లోబల్ మోడల్ పెట్రోల్ శైలిలో ఎంతో ఆకర్షణీయంగా ఉండబోతోంది. అఫీషియల్ టీజర్ల ప్రకారం.. ఈ కారు ముందు భాగంలో సి-షేప్ లైటింగ్, పెద్ద గ్రిల్, నిలువుగా ఉండే డిఆర్ఎల్స్, వెనుక భాగంలో కారు వెడల్పు అంతా విస్తరించే సరికొత్త ఎల్‌ఈడీ లైట్ బార్ తో పాటు టెక్టాన్ బ్యాడ్జింగ్ ఉండనుంది. ఫీచర్ల పరంగా నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీలో అత్యాధునిక సదుపాయాలు ఉండబోతున్నాయి.
Also Read : సిరీస్ కోల్పోవడంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..!
ఇందులో 10.25-ఇంచుల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గూగుల్ కనెక్టివిటీతో కూడిన 10.1-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వెంటిలేటెడ్ సీట్లు ఉండే అవకాశముంది. రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్‌తో పాటు లెవెల్-2 ఏడీఏఎస్ భద్రతా ఫీచర్లు కూడా ఇందులో రానున్నాయి. ఇక ఇంజన్ విషయానికి వస్తే.. ఈ ఎస్‌యూవీ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. వీటికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్లను జతచేయనున్నారు. మార్కెట్లో లాంచ్ అయ్యాక ఈ నిస్సాన్ టెక్టాన్ కారు.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు టాటా సియెర్రా వంటి పాపులర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

