Tuesday, May 19, 2026 04:59 PM
Tuesday, May 19, 2026 04:59 PM

కేంద్రానికి విజయ్ బిగ్ షాక్..!

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ సిఎం అయిన.. దళపతి సి. జోసెఫ్ విజయ్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న ద్విభాషా విధానాన్ని కొనసాగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది అక్కడి ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం లోని త్రిభాషా సూత్రాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ, రాష్ట్రంలోని పాఠశాలల్లో కేవలం తమిళం మరియు ఇంగ్లీష్ భాషలను మాత్రమే బోధించనున్నట్లు రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది.

Also Read : అవును.. వాళ్లిద్దరు కలిశారు.. మరి వీళ్లిద్దరూ..?

ద్విభాషా విధానం అనేది కేవలం ప్రభుత్వ పాలసీ మాత్రమే కాదని.. తమ పార్టీ యొక్క ప్రాథమిక సిద్ధాంతాలలో ఒకటని మంత్రి రాజమోహన్ ప్రకటించారు. 1968వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి, ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సి. ఎన్. అన్నాదురై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ విధానాన్ని మార్చలేదు. అప్పటి నుంచి తమిళులు దీనిని కేవలం ఒక పాలసీలా కాకుండా.. తమ మాతృభాష రక్షణకు, ఆత్మగౌరవానికి రక్షణ కవచంగా భావిస్తూ ఉంటారు.

Also Read : సమన్యాయం అంటే ఇదేనేమో..!

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మోడల్ స్కూల్స్ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పీఎం శ్రీ పథకం కింద నిధులు పొందాలంటే మూడు భాషలను అంటే హిందీతో సహా నేర్పించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంపై సంతకం చేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ఇచ్చే సమగ్ర శిక్షా నిధులను నిలిపివేసినప్పటికీ, విజయ్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ఒత్తిడికి లొంగడం లేదు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కేంద్రంతో రాజీపడి ఈ పథకాన్ని అమలు చేసినప్పటికీ, తమిళనాడు మాత్రం కేంద్ర నిధులను వదులుకోవడానికైనా సిద్ధపడుతోంది కానీ తమ ద్విభాషా విధానంపై రాజీ పడబోమని తేల్చి చెప్పింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

సమన్యాయం అంటే ఇదేనేమో..!

“ఒక కేసు అనేక ప్రశ్నలు, అనేక...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు...

అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న...

పోల్స్