Tuesday, August 4, 2026 03:23 AM
Tuesday, August 4, 2026 03:23 AM

ఎన్టీఆర్ కోసం రిస్క్ చేస్తున్న కన్నడ హీరోయిన్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం డ్రాగన్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్న కన్నడ భామ రుక్మిణి వసంత, ఈ ప్రాజెక్ట్ కోసం తన కెరీర్‌ లో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కోసం ఆమె తన దగ్గరకు వస్తున్న ఇతర భాషల క్రేజీ ప్రాజెక్టులను వదులుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : వైసీపీకి నచ్చని ఐఏఎస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..!

ప్రశాంత్ నీల్ సినిమాలంటే మేకింగ్ పరంగా భారీ సమయం తీసుకుంటారనే పేరుంది. డ్రాగన్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి భారీ కాల్ షీట్స్ అవసరం కావడంతో, రుక్మిణి వసంత ఇతర సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతోంది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి అడ్వాన్స్‌ లు తీసుకున్నప్పటికీ, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఆమె ఆయా సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవద్దనే నిబంధన కూడా దీనికి ఒక కారణమని టాక్.

Also Read : ఆర్‌సీబీలో పాటిదార్ మ్యాజిక్.. కెప్టెన్‌ గా రజత్ అదరహో..!

ఒకవైపు యష్ సరసన టాక్సిక్, మరోవైపు ఎన్టీఆర్ సరసన డ్రాగన్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తుండటంతో రుక్మిణి వసంత పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ రెండు చిత్రాలు ఆమె కెరీర్‌ ను మలుపు తిప్పేవి కావడంతో, ఇతర చిన్న సినిమాల కంటే వీటికే ఆమె ప్రాధాన్యత ఇస్తోంది. షూటింగ్ ఆలస్యమైనా సరే, ఎన్టీఆర్ సినిమాతో వచ్చే పాన్-ఇండియా గుర్తింపు ముందు మిగతా అవకాశాలు చిన్నవే అని ఆమె భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తవ్వగా, త్వరలోనే ఎన్టీఆర్, రుక్మిణి వసంతపై ముఖ్యమైన సీన్లను చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

వైసిపి మాజీ ఎమ్మెల్యే...

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

పోల్స్