Tuesday, April 14, 2026 10:55 PM
Tuesday, April 14, 2026 10:55 PM

ఈరోజు రాశి ఫలితాలు (14-04-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం.. 14-04-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

వృషభం

వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

—————————————

మిధునం

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బందిపడతారు. ధన వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలసిరావు.

—————————————

కర్కాటకం

అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

—————————————

సింహం

బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.

—————————————

కన్య

నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు.

—————————————

తుల

పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది.

—————————————

వృశ్చికం

వ్యాపార వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృథా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

—————————————

ధనస్సు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచెయ్యక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ఆర్ధికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.

—————————————

మకరం

దాయాదులతో భూ సంభందిత వివాదాల నుండి బయటపడతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభవార్త అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

—————————————

కుంభం

ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

—————————————

మీనం

పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. సంతాన విద్యా విషయాలు పట్ల శ్రద్ద వహించాలి. ఉద్యోగమున మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నా భార్యకు భద్రత...

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

వాళ్లిద్దరు కలిశారు సరే.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు...

వైసీపీ రాజకీయ పార్టీనా.....

వైసీపీ నేతల వరుస ప్రకటనలు ఇప్పుడు...

బ్రేకింగ్: కేసీఆర్ కు...

తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ...

టీడీపీ నేతలపై అధిష్టానం...

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...

అమరావతి వేదికగా సాకారమవుతున్న...

ప్రపంచ క్వాంటం డే పురస్కరించుకుని దేశ...

పోల్స్