అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన ఏపీ సిఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. యాడికి ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ సభలో రాజధాని అమరావతిపై మాట్లాడారు చంద్రబాబు. నిన్నటి వరకూ రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేశారు.. ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశామన్నారు సిఎం. ప్రజా రాజధాని అమరావతి చట్టబద్ధతకు పార్లమెంట్‌లో ఒకే ఒక్క దిక్కుమాలిన పార్టీ మద్దతు తెలపలేదని దుయ్యబట్టారు. అమరావతి అని పలకడం ఇష్టంలేక, కొత్తగా ఇప్పుడు ‘మావిగన్’ అంటున్నారని ఎద్దేవా చేసారు.
Also Read : గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. అడ్రెస్ ప్రూఫ్ లేకుండానే..!
రాజధానిలో అవినీతి అంటూ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. నీరు మనందరికీ సర్వస్వం.. దానిని సంరక్షించుకోడానికే ‘వంద రోజుల యాక్షన్ ప్లాన్’ చేపట్టామని తెలిపారు. ‘పూర్వోదయ’ స్కీమ్ ద్వారా కేంద్రం నుంచి రూ.30 వేల కోట్లు.. ప్రైవేటు ద్వారా మరో రూ.70 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గడచిన 21 నెలల్లో నీటి భద్రతా పరంగా, రాష్ట్రవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చాయన్నారు. అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను సభలో చదివి వినిపించారు సిఎం.
Also Read : ఇదేం టీంరా బాబూ.. చెన్నైపై ఫ్యాన్స్ ఫైర్..!
పనితీరు సరిగా కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదిక మీదకు పిలిపించి వివరణ అడిగిన సీఎం చంద్రబాబు.. పనితీరును మెరుగు పర్చుకోవాలంటూ అధికారులకు స్పష్టం చేసారు. ప్రజా సంతృప్తే లక్ష్యంగా పని చేయాలని.. ప్రజలకు సేవలందించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. ట్రాక్టర్లల్లో ఇసుక తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డుకుంటే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చంద్రబాబు. ఓ పక్క సరిగా పనిచేయని అధికారులను వివరణ అడుగుతూనే.. మరోవైపు గత ప్రభుత్వంలో వ్యవస్థలు ఏ విధంగా విధ్వంసం జరిగిందో వివరించడం గమనార్హం.

