Saturday, September 19, 2026 10:14 AM
Saturday, September 19, 2026 10:14 AM

అమెరికా కు షాక్ ఇచ్చిన ఇరాన్..!

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం అత్యంత భీకర స్థాయికి చేరుకుంది. గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను వరుసగా కూల్చివేస్తుండటంతో యుద్ధ మేఘాలు మరింత దట్టమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, పశ్చిమ ఇరాన్‌ లోని ఖుజెస్థాన్ ప్రావిన్స్‌ లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం కూలిపోయింది.

Also Read : అమరావతి కోసం మహిళా ఎంపీలు.. రాష్ట్రానికి సంబంధం లేకపోయినా..!

ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే, కూలిపోయిన విమాన పైలట్ల కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఏ-10 వార్‌థాగ్ విమానం కూడా పర్షియన్ గల్ఫ్ సమీపంలో ఇరాన్ దాడులకు కూలిపోయింది. మరోవైపు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని కూడా తాము కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే, అమెరికా వర్గాలు ఎఫ్-15ఈ కూల్చివేతను ధృవీకరించినప్పటికీ, ఎఫ్-35 వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Also Read : మాట, మర్యాద గురించి పేర్ని నోట నీతి మాటలు..!

విమానాల కూల్చివేత సమయంలో జరిగిన ప్రమాదంలో ఒక పైలట్ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్ ఆచూకీ కోసం అమెరికా ప్రత్యేక దళాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం అమెరికా సైన్యానికి సవాలుగా మారింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, ఈ పరిణామాలు ఇరాన్‌ తో జరగబోయే చర్చలపై ఎలాంటి ప్రభావం చూపబోవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం గమనార్హం. ఈ పోరు మరికొన్ని వారాల్లోనే ముగియనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 2 నుండి 3 వారాల్లో అమెరికా తన సైనిక లక్ష్యాలను పూర్తి చేసుకుంటుందని, యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

పోల్స్