Sunday, July 12, 2026 05:31 AM
Sunday, July 12, 2026 05:31 AM

అమరావతి కోసం మహిళా ఎంపీలు.. రాష్ట్రానికి సంబంధం లేకపోయినా..!

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై పార్లమెంట్‌లో జరిగిన చర్చ కేవలం రాజకీయాలకు పరిమితం కాకపోవడం గమనార్హం. ముఖ్యంగా రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ.. రేణుకా చౌదరి, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది చేసిన ప్రసంగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజ్యసభలో రేణుకా చౌదరి ప్రసంగంలో తెలుగు పదాలు, గతంలో ఆమె మాట్లాడిన మాటలను ప్రస్తావించిన విధానం హైలెట్ గా నిలిచింది. ఈ బిల్లు ఏ పార్టీదో కాదు, 1600 రోజులకు పైగా రోడ్లపై పోరాడిన అమరావతి రైతులది, ముఖ్యంగా కన్నీళ్లను ఆయుధంగా మార్చుకున్న మహిళలది.. అంటూ ఆమె వారికి సెల్యూట్ చేశారు.

Also Read : బ్రేకింగ్; పేర్ని నానికి షాక్ ఇచ్చిన పోలీసులు..!

గుజరాత్ గిఫ్ట్ సిటీకి నిధుల వర్షం కురిపిస్తున్న కేంద్రం, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు మొండిచేయి చూపుతోంది..? దక్షిణాది వారిని ఇంకా మద్రాసీలుగానే చూస్తారా..? అంటూ ఆమె వేసిన ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని అవమానించిన వారికి, అమరావతి అభివృద్ధి ద్వారా తగిన సమాధానం చెబుతామని రేణుకా చౌదరి చేసిన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తన రాజ్యసభ పదవీ కాలంలో చివరి ప్రసంగం చేసిన ప్రియాంక చతుర్వేది కూడా అదే స్థాయిలో ప్రసంగించారు.

Also Read : బాబుకి తలనొప్పిగా మారుతున్న ఎమ్మెల్యేలు.. చర్యలెక్కడ?

ఈ బిల్లును ఈరోజు ప్రవేశపెట్టడం అంటే.. గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగిందని కేంద్రం అంగీకరించడమే అంటూ ఆసక్తికర కామెంట్ చేసారు. న్యాయం ఆలస్యంగా జరిగినా, కనీసం ఇప్పుడైనా అమరావతికి చట్టబద్ధత కల్పించడం సంతోషకరమని, ఇది ఏపీ ప్రజల చిరకాల స్వప్నమని ఆమె పేర్కొన్నారు. కేవలం కాగితాల మీద చట్టం సరిపోదని, అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏది ఎలా ఉన్నా.. రాష్ట్రానికి సంబంధం లేని ఇద్దరు మహిళా ఎంపీలు ఈ స్థాయిలో అమరావతి గురించి మాట్లాడటం మాత్రం ఓ చరిత్ర అంటున్నారు పరిశీలకులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ ముగ్గురి చుట్టూ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్...

కఫ్ సిరప్‌లపై కేంద్రం...

భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్‌లు,...

కొరియా స్టాక్ మార్కెట్‌ను...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి...

అంతా ఓపెన్.. రావణ్‌కు...

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న...

దూకుడు పెంచిన కవితక్క.....

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.....

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా...

పోల్స్