Sunday, September 20, 2026 12:58 AM
Sunday, September 20, 2026 12:58 AM

తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పై మృణాల్ సెన్సేషనల్ కామెంట్స్..!

మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమా నుంచి మన తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన హీరోయిన్. ఆ సినిమా తర్వాత పాప కెరీర్ పీక్స్ కు వెళ్ళింది. వరుస ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా గడుపుతోంది. లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ సినిమాలో నటించింది మృణాల్. దో దీవానే సెహెర్ మే అనే సినిమాలో నటించిన ఆమె.. ఆ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఈ నేపధ్యంలో.. రౌనక్ రజని యూట్యూబ్ ఛానెల్‌ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర విషయం గురించి బయటపెట్టింది.

Also Read : మోహన్ బాబు అరెస్ట్ తప్పదా..?

హృతిక్ రోషన్ తో కలిసి సూపర్ 30 సినిమా చేస్తున్న సమయంలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ అభద్రతా భావానికి గురయ్యాడని పేర్కొంది. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ.. హృతిక్ రోషన్ వంటి అందంగా కనపడే వారితో తిరిగినా, షూటింగ్ లో పాల్గొన్నా సరే అతను ఇబ్బంది పడేవాడు అని గుర్తు చేసుకుంది. ఆ తర్వాతి నుంచి అతను కూడా అందంగా కనపడేందుకు.. జిమ్ లో వర్కౌట్ చేసేవాడు అని తెలిపింది. 15-17 కిలోలు తగ్గాడని, కండలు పెంచుకున్నాడని.. తాను ఎప్పుడూ కూడా అలా చేయాలని తాను అడగలేదని పేర్కొంది.

Also Read : అన్నీ తెలిసే ఆడుకుంటున్నారు.. మీకో నమస్కారం..!

చివరకు తినడం మానేసి మళ్ళీ 20 కిలోలు పెరిగాడని తెలిపింది. తాను అందంగా ఉన్న వాళ్ళతో సినిమాలు చేస్తే అతను భయపడతాడని, తాను ఎలా ఉన్నా సరే.. మారమని అడగలేదని గుర్తు చేసుకుంది. ఇక రిలేషన్ లో ఉన్నప్పుడు అభద్రతాభావం ఉంటే వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని సూచించింది. ఇక ధనుష్ తో రిలేషన్ పై కూడా ఆమె రియాక్ట్ అయింది. అసలు ఇది ఎవరు క్రియేట్ చేసారో తనకు తెలియదని, ఏప్రిల్ ఫూల్ రూమర్ అంటూ కొట్టిపారేసింది మృణాల్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్