Sunday, June 21, 2026 01:39 PM
Sunday, June 21, 2026 01:39 PM

ఉమా లేని లోటు కనపడుతోందా..? సోషల్ మీడియాలో కొత్త చర్చ..!

దేవినేని ఉమా.. తెలుగుదేశం పార్టీలో ఒక సమయంలో అత్యంత ప్రభావం చూపిన నాయకుల్లో ఒకరు. రాజకీయంగా పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు, అధినేతగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నప్పుడు తోడు నిలబడిన అతి తక్కువ మంది నేతల్లో ఒకరు. తాను నిర్వహించే శాఖలపై పూర్తి స్థాయిలో పట్టు పెంచుకున్న మంత్రిగా కూడా ఉమాకు గుర్తింపు ఉండేది. కానీ 2024 ఎన్నికల తర్వాత ఉమాను పార్టీ కొంత పక్కన పెట్టింది అనే విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ కు ప్రాధాన్యత దక్కింది.

Also Read : చరిత్ర మర్చిపోతే ఎలా జగన్..!

అయితే ఇప్పుడు ఉమా లేని లోటు కనపడుతోందని పార్టీ క్యాడర్ అంటుంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. నారా కుటుంబంపై ఎవరు విమర్శలు చేసినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విరుచుకుపడేవారు ఉమా. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ అంబటి రాంబాబు చంద్రబాబును ఆ మాట అన్నప్పుడు.. మైలవరం నియోజకవర్గం నుంచి స్పందన కరువైంది. వసంత కృష్ణ ప్రసాద్ కనీసం బయటకు రాలేదు.

ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. దీనితో కార్యకర్తలు ఫైర్ అయిపోతున్నారు. ఉమా లేని లోటు తెలిసిందని, డబ్బుకు నమ్మకానికి ఉన్న తేడా ఇప్పుడు మైలవరం చూస్తోంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఉమా విషయంలో ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచన చేసి ఆయనకు న్యాయం చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. డబ్బుల కోసం పాకులాడే వారికి నియోజకవర్గం అప్పగించి నాశనం చేసారని మండిపడుతున్నారు కార్యకర్తలు.

Also Read : స్కిల్ కేసు ముగిసింది.. బాబుకు క్లీన్ చిట్

ఉమా ఉన్నప్పుడు జిల్లాలో ఎన్ని విభేదాలు ఉన్నా బయటకు వచ్చేవి కాదని, నాయకత్వం మొత్తాన్ని ఆయన నడిపించే వారు కొందరు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తప్పులు సహజమే అని ధైర్యం ఉన్న నాయకత్వాన్ని పార్టీ దూరం చేసుకుంటుంది అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక ఉమా విషయంలో జిల్లా నాయకత్వం మొత్తం సైలెంట్ గా ఉండటం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. సరిహద్దు జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే కనీసం కృష్ణా జిల్లా నాయకులు అడుగుపెట్టలేదని మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్