Wednesday, February 4, 2026 12:23 PM
Wednesday, February 4, 2026 12:23 PM

చంద్రబాబు ఫిట్నెస్ కు పెమ్మసాని షాక్.. ఎలా ఇలా..?

సాధారణంగా 60 ఏళ్ళు దాటిన తర్వాత విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడానికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. ఉదయం లేవడం, మధ్యాహ్నం విశ్రాంతి, రాత్రి త్వరగా నిద్రపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఏపీ సిఎం చంద్రబాబు విషయంలో మాత్రం ఇది పక్కాగా డిఫరెంట్ గా ఉంటుంది. ఫిట్నెస్ కు ప్రయారిటీ ఇచ్చే సిఎం.. కష్టపడే విషయంలో మాత్రం ఎక్కడా కూడా విశ్రాంతి అనే మాటకు ప్రయారిటీ ఇవ్వరు. దేశంలో ఏ సిఎం లేని విధంగా మీడియాలో ఎక్కువగా కనపడుతూ ఉంటారు చంద్రబాబు.

Also Read : డిప్యూటీ సీఎంగా నారా లోకేష్? వేణు స్వామి అంచనాలు కలకలం

గత రెండు రోజుల నుంచి చంద్రబాబు షెడ్యూల్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. మొన్న పోలవరం పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు.. అదే రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లి.. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయానికి ఇంటికి చేరుకున్నారు. ఈ పర్యటన ఆసాంతం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రబాబుతోనే ఉన్నారు. ఒంటిగంటన్నర వరకు తనతోనే ఉన్న సిఎం ఫిట్నెస్ ను చూసి తాను ఆశ్చర్యపోయాను అంటూ గుంటూరు సభలో పెమ్మసాని వ్యాఖ్యానించారు. ఇక ఆ తర్వాత నిన్న ఉదయం కేబినేట్ సమావేశానికి హాజరు అయ్యారు.

Also Read : సీసాలు వాళ్లవే.. స్క్రిప్ట్ వాళ్లదే.. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

కేబినేట్ సమావేశం తర్వాత గుంటూరులో సరస్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు అయ్యారు. అక్కడ దాదాపు గంట పాటు ఉన్నారు సిఎం. అక్కడి నుంచి ఇంటికి చేరుకొని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత.. ఆవకాయ్ అమరావతి కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. 75 ఏళ్ళ వయసులో చంద్రబాబు అలా ఎలా తిరుగుతున్నారని కొందరు, ఆయన ఫిట్నెస్ దేశంలో ఏ సిఎంకు లేదని ఇంకొందరు కామెంట్స్ చేస్తూ కొనియాడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్