టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. భీకర ఫాంలో ఉన్నాడు. తనను టార్గెట్ చేసిన కొందరికి కోహ్లీ అదిరిపోయే సమాధానం ఇస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మరోసారి కోహ్లీ మేనియా నడుస్తోంది. గత ఏడాది కోహ్లీకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. 2025 లో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం, ఐపిఎల్ విజేతగా ఆర్సీబీ నిలవడం, సౌత్ ఆఫ్రికాపై రెండు సెంచరీలు, విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ వంటివి కోహ్లీ చేసాడు. ఇక ఇప్పుడు 2026 లో కోహ్లీ ముందు కొన్ని కీలక రికార్డులు ఉన్నాయి.
Also Read : బ్రేకింగ్: గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్..!
2026 ఐపీఎల్‌లో 9000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు విరాట్ కోహ్లీకి ఇంకా 339 పరుగులు అవసరం. ప్రస్తుతం అతను 259 ఇన్నింగ్స్‌ల్లో 8661 పరుగులు సాధించి ఐపీఎల్ చరిత్రలో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ (267 ఇన్నింగ్స్‌ల్లో 7046 పరుగులు) అతని తర్వాత స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత 15,000 వన్డే పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచే అవకాశం ఉంది . టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌లలో 18,426 పరుగులు సాధించాడు.
Also Read : చంద్రబాబు నాయుడు – గ్రీన్‌ఫీల్డ్ ఆర్కిటెక్ట్
వన్డేల్లో 15,000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్. కోహ్లీ ప్రస్తుతం 296 ఇన్నింగ్స్‌లలో 14,557 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా ఉన్నాడు. 15,000 పరుగుల మార్కును చేరుకోవడానికి కోహ్లీకి 443 పరుగులు కావాల్సి ఉంది. 2026లో న్యూజిలాండ్ తో జరిగే తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ మరో మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను 623 ఇన్నింగ్స్ లలో (టెస్టులు + వన్డేలు + టీ20లు) 27,975 పరుగులు చేశాడు. మరో 42 పరుగులు చేస్తే, కోహ్లీ కుమార్ సంగక్కర (28,016 పరుగులు)ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.

