ఏపీలోని కూటమి ప్రభుత్వం తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. త్వరలో పదవీ విరమణ చేయనున్న సీఎస్ విజయనంద్ కోసమే.. ఇందనం శాఖలో మరో కొత్త పోస్టు సృష్టించ బోతున్నారా..? ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇప్పటికే సర్వీస్ నుండి రిటైర్డు అయినప్పటికి, మరో 3 నెలలు ఆయన సర్వీసును పొడిగించారు. అలా పొడిగించిన, సీఎం చంద్రబాబు పొడిగించిన సర్వీస్ గడువు పూర్తి అయ్యాక కూడా, మరో కీలకమైన పోస్టు సృష్టించి, ఆ పోస్టులో విజయానంద్‌ను సిఎం చంద్రబాబు నియమించనున్నారనే మాట బాగా వినిపిస్తోంది. సీఎస్ విజయానంద్‌పైన సీఎం చంద్రబాబుకు ఎందుకు ఇంత ప్రత్యేక అభిమానం, ఇష్టం అనే విషయం ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్‌గా మారింది. దీని వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కావటం లేదు.
Also Read : మళ్లీ తెరపైకి వైఎస్ఆర్ బొమ్మ..!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి అత్యంత సన్నిహితులు. ప్రస్తుతం ఆయన సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ఎందుకు ఇష్టుల జాబితాలో చేరారనేది ఎవరికీ అర్థం కావటం లేదు. కానీ ప్రస్తుతం విశ్వేశ్వర రెడ్డి ప్రభావం మాత్రం బాగా పనిచేస్తుందనే మాట బలంగా వినిపిస్తోంది. అందుకే విశ్వేశ్వర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్ అధికారిగా గుర్తింపున్న విజయానంద్ సీఎస్ పదవి చేపట్టడం వెనుక విశ్వేశ్వర రెడ్డి హస్తం ఉందనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. అందుకే పదవీ విరమణ గడువు ముగిసినా కూడా మరో మూడు నెలల పాటు పొడిగింపు జిరిగిందని.. ఇందుకు విశ్వేశ్వర రెడ్డి ఎంతో కృషి చేశారని జోరుగా చర్చ నడుస్తోంది.
ఇక వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విద్యుత్ శాఖాధిపతిగా వ్యవహరించిన విజయానంద్.. ఇప్పుడు కూడా అదే శాఖలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవి విరమణ తర్వాత కూడా విజయానంద్ కోసం ప్రభుత్వ పదవి ఎదురు చూస్తుందనే మాట అటు పొలిటికల్ సర్కిల్‌లో, ఇటు సచివాలయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. విజయానంద్ కోసం మరో కీలక పోస్టును సృష్టించేందుకు షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారట. ప్రస్తుతం ఉన్న విద్యుత్ రెగ్యులేట్ అధారిటీని యధావిధిగా కొనసాగిస్తూ.. ఆ సంస్థకు ఉన్న అధికారాలను.. కొత్తగా సృష్టించబోయే విద్యుత్ కో ఆపరేటివ్ సోసైటీకి బదలాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంటే కరెంటు కొనుగోళ్లు కూడా ఇక రెగ్యులేట్ అధారిటీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ఈ కొత్త పోస్టులో విజయానంద్‌ను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక విశ్వేశ్వర రెడ్డి ప్రభావం ఉందనేది బహిరంగ రహస్యం.
Also Read : క్యూబ్ నెట్ వర్క్ ను దెబ్బకొట్టిన ఐబొమ్మ రవి..?
ఏది ఏమైనా సరే.. సీఎస్ విజయానంద్ అదృష్టం మరో ఐఏఎస్ అధికారికి ఉండదనేది అటు బ్యూరోక్రాట్‌లలో.. ఇటు పొలిటికల్ సర్కిల్‌లో బాగా చర్చ నడుస్తోంది. సీఎం చంద్రబాబు కూడా విజయానంద్ పట్ల ఎంతో అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు విశ్వేశ్వర రెడ్డి ప్రధాన కారణమనే మాట కూడా వినిపిస్తోంది. నిజానికి షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ పైన, ఆ సంస్థ అధినేత విశ్వేశ్వర రెడ్డి పైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ఆధారాలతో సహా ఆరోపణలు చేశారు. అయితే ఆయన చేసిన విమర్శలను కానీ, ఆరోపణలను కూడా కూటమి ప్రభుత్వ పెద్దలు, అధికారులు, అటు షిరిడిసాయి ఎలక్ట్రికల్ సంస్థ ప్రతినిధులు.. ఏ ఒక్కరు కూడా ఖండించ లేదు సరి కదా.. ఆ విషయంపై చర్చించేందుకు కూడా కనీసం ముందుకు రాలేదు. అంటే.. ఏబీ వెంకటేశ్వర రావు చేసిన ఆరోపణల్లో నిజాలు వున్నాయనే మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

