Thursday, April 30, 2026 03:21 PM
Thursday, April 30, 2026 03:21 PM

ఈరోజు (19-12-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం 19-12-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 19-12-2025

వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. రాజకీయ ప్రముఖుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

—————————————

వృషభం 19-12-2025

వృత్తి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

—————————————

మిధునం 19-12-2025

బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి

—————————————

కర్కాటకం 19-12-2025

విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

—————————————

సింహం 19-12-2025

మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహన్నిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

—————————————

కన్య 19-12-2025

నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి . వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఇతరులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది . ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

—————————————

తుల 19-12-2025

ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృ వర్గ బంధువులతో వివాదాలు కలుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. .ఆదాయ మార్గాలు మందగిస్తాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.

—————————————

వృశ్చికం 19-12-2025

గృహమున శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి కొంత వరకు బయట పడతారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

—————————————

ధనస్సు 19-12-2025

వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలించవు. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

—————————————

మకరం 19-12-2025

నూతన వ్యాపారాలు ప్రారంభించిన తగిన లాభాలు అందుకుంటారు. ధనదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

—————————————

కుంభం 19-12-2025

ఉద్యోగమున సహోద్యోగుల నుండి విమర్శలు అధికమవుతాయి. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.

—————————————

మీనం 19-12-2025

స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు బహుమతులుగా పొందుతారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తులాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.

————————————–

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పూడి శ్రీహరి.. ల్యాప్...

వైఎస్ జగన్ మాజీ పీఆర్వో పూడి...

బ్రేకింగ్ : టీడీపీ...

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు...

బీ కేర్ ఫుల్.....

నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల తీరు...

వాంఖడేలో రోహిత్ ఆడతాడా..?...

ఐపీఎల్ 2026 సీజన్‌ లో వరుస...

పోల్స్