Wednesday, February 4, 2026 09:21 PM
Wednesday, February 4, 2026 09:21 PM

జగనన్నపై ఫైర్ బ్రాండ్‌ ఆగ్రహం..!

వైసీపీలో ఫైర్ బ్రాండ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఆర్కే రోజా. 2014లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన రోజా.. స్పీకర్‌పైన, సహచర మహిళా నేతలపైన అనుచిత వ్యాఖ్యలు, కించపరిచే హావభావాల కారణంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక ఆ తర్వాత 2019లో రెండోసారి ఎన్నికైన వెంటనే మంత్రిపదవి వస్తుందని ఆశించి భగపడ్డారు. ఆ తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో రోజాకు పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ కేటాయించారు జగన్. ఆ సమయంలో కూడా రోజా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత మూట గట్టుకున్నారు. వైసీపీలో అగ్రనేతలపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఢీ అంటే ఢీ అనేలా కయ్యానికి కాలు దువ్వారు. కొన్నిసార్లు పెద్దిరెడ్డి వర్గంపై పై చెయ్యి సాధించేందుకు తీవ్రంగా కృషి చేసినప్పటికీ.. రోజా ఆశించిన ఫలితం దక్కించుకోలేక పోయారు.

Also Read : థియేటర్లకు అఘోరాలు.. నార్త్ లో ఊగిపోతున్న శివ భక్తులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనకు ఎదురే లేదు అనేలా పెత్తనం చేయాలని రోజా ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ.. పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన వంటి నేతల ముందు నిలబడలేకపోయారు. ఇదే సమయంలో నగరి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు కూడా రోజా తెర లేపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో రోజాకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఒక దశలో రోజాను ఐరన్ లెగ్ అంటూ ప్రచారం కూడా చేశారు. దీనిపై పార్టీ పెద్దలకు రోజా స్వయంగా ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి ఫలితం రాలేదు. ఇదే సమయంలో తనపై ఆరోపణలు చేసిన చక్రపాణిరెడ్డికి శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్ పదవి దక్కడంతో అప్పట్లో రోజా తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశారు. రోజా నోటీ తీరు వల్లే 2024 ఎన్నికల్లో ఓడిందనే ప్రచారం ఫలితాలు వచ్చిన తొలి రోజు నుంచే ప్రారంభించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అందుకే వైసీపీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

తాజాగా వైసీపీ పెద్దలపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తన వర్గం నేతలతో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత జగన్‌పైన కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నగరిలో తనను సొంత పార్టీ నేతలే పదే పదే ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. తన ఉనికి లేకుండా చేయాలని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించినట్లు సమాచారం. నియోజకవర్గంలోని విజయపురం, నిండ్ర ఎంపీపీ స్థానాలు టీడీపీ ఖాతాలో చేరడం వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని రోజా ఆరోపించారు. వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ నేతలతో పాటు వైసీపీలోని తనకు వ్యతిరేక వర్గం ప్రలోభాలకు గురి చేసిందని.. అందుకే ఆ రెండు ఎంపీపీ స్థానాలు టీడీపీ ఖాతాలో చేరాయని విమర్శించారు. తన ఎదుగుదలను పార్టీలోని కొందరు ముఖ్యనేతలు అడ్డుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఆపరేషన్ చేయించుకుంటే.. కనీసం పరామర్శించలేదని.. కానీ ఇదే సమయంలో తన ప్రత్యర్థుల ఇంట్లో జరిగిన కార్యక్రమాలకు ఎలా హాజరవుతారని నిలదీశారు.

Also Read : అధికారులను హడలెత్తిస్తున్న బీఆర్ నాయుడు

నగరి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలపై ఇప్పటికే పలుమార్లు తాడేపల్లి పెద్దలకు స్వయంగా ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాజాగా చక్రపాణిరెడ్డి తనపై బహిరంగ విమర్శలు చేసినా కూడా పార్టీ పెద్దలు కనీస వివరణ కూడా తీసుకోలేదని రోజా అసహనం వ్యక్తం చేశారు. 2004 నుంచి ఏపీ రాజకీయాల్లో ఉన్నానని.. ఉమ్మడి చిత్తూరు జిల్లా వదిలి ఎక్కడికీ పోలేదన్నారు. అయినా సరే.. తాను పార్టీ మారుతున్నట్లు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తనపై పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాలన్నీ గతంలోనే జగన్‌ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని రోజా గుర్రుగా ఉన్నారు. పార్టీలో కొందరు నేతలే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న రోజా.. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే.. తాను కఠిన చర్యలు తీసుకోక తప్పదని కార్యకర్తలతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలోనే వైసీపీలో రోజా బాంబ్ పేల్చే అవకాశాలున్నాయనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్