Wednesday, May 6, 2026 11:54 PM
Wednesday, May 6, 2026 11:54 PM

రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన..!

సాధారణంగా పండుగ సమయంలో మనం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల, టికెట్ ధరలను ఏ స్థాయిలో పెంచుతారో చూస్తూనే ఉంటాం. 100% నుంచి 200% వరకు పెరిగిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేని బస్సులకు కూడా టికెట్ ధరలు భారీగా పెంచుతారు. వాస్తవానికి ఈ విధానానికి స్ఫూర్తి పొందింది విమానయాన శాఖ నుంచి. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో విమాన టికెట్ ధరలను యాజమాన్యాలు భారీగా పెంచేస్తాయి. వెయ్యి కిలోమీటర్ల లోపు కూడా పాతిక నుంచి 30 వేల రూపాయల వరకు వసూలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Also Read : నెల్లూరులో వైసీపీ చివరి కోట కూడా కూలుతోందా..?

ఆఖరి నిమిషంలో టికెట్ చేసుకోవాల్సి వస్తే భారీగా చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఉండేది. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నాయి విమానయాన సంస్థలు. ఇటీవల ఇండిగో వ్యవహారంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు ఏ విమానం రద్దువుతుందో అర్థం కాక సతమతమయ్యారు. దీనితో చాలామంది ఇతర విమానాయన సంస్థలను నమ్ముకున్నారు. కానీ టికెట్ ధరలు మాత్రం భారీగా చూపించాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే సాధారణంగా మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఉండేది. కానీ అనూహ్యంగా 15000 నుంచి 20 వేల వరకు పెంచేసాయి విమానాల సంస్థలు.

Also Read : లోకేష్ కమిట్మెంట్ కు షాక్ అయిన టీడీపీ నేతలు

విశాఖ నుంచి హైదరాబాద్ కు పాతిక నుంచి 30 వేల రూపాయలు వసూలు చేశారు. దీనితో కేంద్ర ప్రభుత్వం పై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం విమానయాన సంస్థలతో చర్చలు జరిపి.. టికెట్ ధరలు తగ్గించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ టికెట్ ధరలపై కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. టారిఫ్ మానిటరింగ్ యూనిట్ ను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. ముఖ్యమైన సందర్భాల్లో టికెట్ చార్జీలను పెంచడం సరికాదని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితి రాకుండా నివారించే ప్రయత్నం చేస్తున్నామని, టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయనిపిస్తే ప్రయాణికులు ఆ స్క్రీన్ షాట్లను కూడా మాకు పంపవచ్చు అన్నారు. అంతర్జాతీయ రూట్ లలో కూడా టికెట్ రేట్లు మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్